

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రతి ఉద్యోగి పదవి విరమణ అనంతరం తాను పనిచేసిన సంస్థకు తమ అమూల్యమైన సూచనలు సలహాలు అందించాలని ఏలేశ్వరం ఆర్టీసీ డిపో మేనేజర్ జి వి సత్యనారాయణ కోరారు. స్థానిక ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తూ పదవి విరమణ చేపట్టిన జి సత్యనారాయణ (తిరుమల జి ఎస్) కు ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డిపో మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి పదవి విరమణ తో తమ జీవితం ఆగిపోయింది అనుకోకుండా సంస్థకు సేవలందించాలని కోరారు. ఎం ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి యుబిఎం కుమార్ మాట్లాడుతూ సత్యనారాయణ 26 సంవత్సరాలు సర్వీస్ లో ఎటువంటి రిమార్కు లేకుండా క్రమశిక్షణ నిబద్దతతో తన విధులు నిర్వహించారని కొనసాగారు. ప్రతి ఒక్కరూ సత్యనారాయణ ను ఆదర్శంగా తీసుకుని విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇంచార్జ్ ఏవి ఎస్ నారాయణ, హెడ్ క్లర్క్ శేఖర్, జివి రామారావు, కే టి మూర్తులు, బి ఎస్ బాబు, ఏపిపిటీబిసి డబ్ల్యూ ఏ,ఏపిపిటిజిఈఏ కోశాధికారి భీమన సూరిబాబు, కే ప్రవీణ్, పి ఎస్ రావు, ఐ శివ, జె శ్రీను, కే బి కే రావు, ఎన్ వి రావు, కే మాణిక్యం, బివివి డి ప్రసాద్, జక్క శ్రీను, వీరవరం శ్రీను, గంగ, ఎల్ ఎన్ రావు, మల్లయ్య, మహిళా కండక్టర్లు విజయ, అమ్ములు, అనురాధ తదితరులున్నారు.