రాజ్యాంగ బద్దంగా రైతుకు వ్యాపారితో సమానంగా హక్కులు కల్పించాలి

Mana News – తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్. ఆర్.అల్వార్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు బ్యాంకుల వద్దకు భూమిని తాకట్టు పెట్టుకొని అప్పు ఇచ్చే వ్యవస్థ మన దగ్గర లేదు. వ్యాపారస్తుల విషయంలో మాత్రం ఎటువంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇస్తున్నారు. బ్యాంకులు రైతులకు కేవలం పంటలను పెట్టుబడిన మాత్రమే ఇస్తున్నారు. పంట రుణము పెట్టుబడి రుణము మాత్రమే ఇస్తున్నారు.ఇలా సగం రుణాలు మాత్రం ఇవ్వడం వలన వచ్చిన రుణాన్ని రైతు తన నిత్యవసరాలకు వాడుకొని పెట్టుబడి సమయం వచ్చేసరికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర మూడు రూపాయలకు ఐదు రూపాయలకు వడ్డీ తీసుకువచ్చి వ్యవసాయంపై పెట్టుబడి పెడుతున్నాడు. పంటలో నష్టం ఏర్పడినప్పుడు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.రైతు యొక్క భూమిని రెవెన్యూ వాల్లు వేరే వాళ్లకు అక్రమ పట్టా చేస్తే బాధిత రైతుకు న్యాయం చేసేది ఎవరు. కోర్టుకు వెలితే అక్రమ పట్టాదారులపైన శిక్ష వేయదు. రెవెన్యూ అధికారులపైన శిక్ష వేయదు, అంటే రైతును మోసం చేసిన వారిపై చర్యలు ఉండవు. అంటే చట్టం తనపని తామ చేయదు రైతు విషయంలో, వ్యాపారిని మోసం చేస్తే చట్టం తనపని తాను చేస్తుంది. వ్యాపారిని మోసం చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాయి. అంటే రైతుకు మోసం చేయడానికి అందరికి హక్కు ఉంది. న్యాయం చేయడానికి ఎవరు లేరు.రైతును మోసం చేస్తే అంటే రైతు యొక్క భూమిని అప్పు ఇస్తామని మోసం చేసి, భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే పోలీసులు కేసు నమోదు చేయరు. దీన్నిబట్టి రైతుకు న్యాయం చేయడానికి పోలీసులు సిద్ధంగా లేరు. బ్యాంకులు కుదువబెట్టుకొని అప్పు ఎకరాకు లక్ష రూపాయలు మాత్రమే ఇస్తారు. అంటే కోటి రూపాయల భూమికి లక్ష రూపాయలు మాత్రమే ఇస్తారు. బంగారం కుదువపెట్టుకుంటే 60 శాతం లోను ఇస్తారు. కాని రైతుకు 1 శాతం మాత్రమే ఇస్తారు. అది వంట ఋణం ఇవ్వకుంటే మాత్రమే అందువల్ల రైతు ప్రైవేటు వ్యాపారులకు భూమిని అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తేనే ఎకరాకు 5లక్షలు మాత్రమే అప్పు ఇవ్వడానికి ఒప్పుకుంటారు, కొన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్కు వెలితే కేసు నమోదు చేయడానికి ఒప్పుకోరు, రెవెన్యూ అధికారుల దగ్గరకు వెలితే న్యాయం చేయరు. అంటే రైతులకు పోలీసులు న్యాయ సహాయం చేయరు, బ్యాంకులు అప్పులు ఇవ్వవు, రైతుల భూములను అక్రమ పట్టా చేసిన వారిపై మరియు అక్రమ పట్టా చేసుకున్న వారిపైన కోర్టులు శిక్ష వెయ్యవు.

డిమాండ్లు :-
1) రైతులను మోసం చేసినవారిపై సివిల్ కేసు కాదు. క్రిమినల్ కేసు నమోదు చేయాలి.
2) ఎకరాకు పంట ఋణం లక్ష రూపాయలు ఇవ్వాలి.
3) ఎకరా భూమి కుదువ పెట్టుకొని 40 లక్షల ఋణం ఇవ్వాలి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ పెట్టుకోవడానికి
4) అసైన్మెంట్ చట్టం ఆర్.ఓ. ఆర్. చట్టం సీలింగ్ యాక్ట్ ఆర్.టి.ఏ యాక్ట్ చట్టాలను దిక్కరించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి.
5) రైతుకు చట్టబద్ధంగా ఇన్సూరెన్స్ కల్పించాలి.
6) ఒట్టిపోయిన పాడి ఆవులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.

Related Posts

చెక్పోస్ట్ దగ్గర అప్రమత్తంగా ఉండాలి,ఉట్కూర్ ఎస్సై కృష్ణంరాజు.

మన న్యూస్, నారాయణ పేట:- రబీ సీజన్లో నారాయణపేట జిల్లా లోకి పోరుగు రాష్ట్రం నుండి అక్రమంగా వరి ధాన్యం రాకుండా ఉండేందుకు ఉట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బార్డర్లో ఏర్పాటుచేసిన సమీస్తాపూర్ చెక్పోస్టును ఎస్ ఐ కృష్ణంరాజు ఆకస్మికంగా తనిఖీ…

ఉండవెల్లి మండలం ప్రగటూరు గ్రామంలో 18 గడ్డివాములు దగ్ధం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 2 :- జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ప్రగటూరు గ్రామం లో రైతు లు 18 గడ్డివాములు కాళీ పోవడం జరిగింది 800 పియుఎస్ పైప్ లూ కలిపోవడం జరిగింది ఫైర్ సిబ్బంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

బ్రహ్మంగారి మఠం ఆరాధన ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు—ఆర్డీవో— చంద్రమోహన్

బ్రహ్మంగారి మఠం ఆరాధన ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు—ఆర్డీవో— చంద్రమోహన్

వర్హాల వల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి.

వర్హాల వల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి.

పరిశుభ్రత, విద్యా, ఆరోగ్యం పై అవగాహన సదస్సు.

పరిశుభ్రత, విద్యా, ఆరోగ్యం పై అవగాహన సదస్సు.

అంగరంగ వైభవంగా కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ మహోత్సవం

అంగరంగ వైభవంగా కల్వరి మౌంట్  ఫ్యామిలీ ఫెస్టివల్ మహోత్సవం

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు పాకల విద్యార్థినిలు

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు పాకల విద్యార్థినిలు

కొండాపురం మండలం పార్లపల్లి గ్రామంలో జోరుగా టిడిపి పార్టీ సభ్యత కార్డులు పంపిణీ

కొండాపురం మండలం పార్లపల్లి గ్రామంలో జోరుగా టిడిపి పార్టీ సభ్యత కార్డులు పంపిణీ