

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 29: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో మక్తల్ కు చెందిన మహేశ్వరి (20),వనపర్తికి చెందిన మనీషా శ్రీ(21) అనే ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొందరి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి వివరాల్లోకి వెళ్తే గద్వాల జిల్లా కేంద్రంలోని కొత్త హౌసింగ్ బోర్డు లోని రిక్వెస్ట్ బస్ స్టాప్ దగ్గర బస్సుకోసం ఎదురు చూస్తున్న గద్వాల నర్సింగ్ కాలేజీ విద్యార్థినిలపైకి అక్ష్మాత్తుగా ఒక బొలెరా వాహనం వేగంగా దూసుకు వచ్చి విద్యార్థులను డీ కొడుతూ వేగంగా కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టింది ఆ సమయంలో ఇద్దరు విద్యార్థినులను ఈడ్చుకొని కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది ఈ దుర్ఘటనలో ఇద్దరు చనిపోగా మరికొందరికి గాయాలయ్యాయి వెంటనే స్పందించిన పోలీసు అధికారులు వారిని హుటాహుటిన గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెలే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు విద్యార్థులకు అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఎస్పీ శ్రీనివాస రావు లు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ప్రమాదానికి కల కారణాలను తెలుసుకున్నారు వైద్యులకు సూచిస్తూ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు…ప్రమాదానికి కల కారణం అధిక స్పీడ్ అదేవిధంగా మంగళవారం జములమ్మ ద్యావరా ఉండటంతో రోడ్డు ఎక్కువ రద్దీగా ఉండటం కూడా మరో కారణం అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
