కావలిలో ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణస్వీకారం

మన న్యూస్, కావలి, ఏప్రిల్ 29:- ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సోమవారం పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా అసోసియేషన్ సభ్యులకు ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేశారు. వాహన ప్రమాద సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా హెల్మెట్లను అందజేశారు. అసోసియేషన్ సభ్యుల కుటుంబాల్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ లలో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి మోమెంటోలు, గిఫ్టులు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలం చూపాలని ఎమ్మెల్యే ను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ……జ్ఞాపకాలను తమ కెమెరా లతో బంధించి పది కాలాల పాటు నిలిపేవారు ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు అని కొనియాడారు. వస్తున్న ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాన్ని పెంచుకొని ఆకర్షణీయంగా ఫోటోలు, వీడియోలు తీసే విధంగా మార్పులు చెందాలని వారికి సూచించారు. అసోసియేషన్ కు అవసరమైన భవన నిర్మాణానికి కావలసిన స్థలాన్ని ఒక నెలలో చూపుతానని తెలిపారు. పార్టీలకుతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి ఉండాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో కావలి డిఎస్పి పి శ్రీధర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునందరావు, డాక్టర్ రామస్వామి, టిడిపి నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, పొట్లూరి శ్రీనివాసులు, పోతుగంటి అలేఖ్య, తిరివీధి ప్రసాద్, జనసేన కావలి నియోజకవర్గం ఇంచార్జ్ అలహరి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు..

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..