

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 29: బద్వేల్ పట్టణంలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్గా మంచూరి సూర్యనారాయణ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నియమించడంతో బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులలో నూతన స్థానం వెలువడింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో సంబరాలు నిర్వహించారు. అనంతరం సూర్యనారాయణ రెడ్డి టిడిపి కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి నెల్లూరు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం స్వర్గీయ ఏంటి రామారావు విగ్రహానికి మరియు నాలుగు రోడ్ల కూడలిలోని నాటి తెలుగుదేశం పార్టీ నేత స్వర్గీయ బిజీ వేముల వీరారెడ్డి విగ్రహానికి పూలమాలవేసి అంజలి ఘటించి, అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను డిసిసి చైర్మన్గా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నాకు అన్ని రకాలుగా సహకరించిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టిడిపి సమన్వయకర్త రితేష్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయనని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ అధ్యక్షులు వెంగల్ రెడ్డి, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు షేక్ జహంగీర్ భాష, 21 వార్డ్ 22 ఇంచార్జ్ ఎన్వి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.