

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 29: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల అపరిస్కృత సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, రెండవ రోజు రిలేనిరహర దీక్ష బద్వేల్ డిపో ఏర్పాటు చెయ్యడం జరిగినది. ఈ సందర్భంగా సురా జనార్దన్ రావు మాట్లాడుతూ ,ఉద్యోగుల ఉద్యోగ భద్రతా సర్క్యులర్ 1/2019 సర్కులర్ ను అమలు చేయాలని,అక్రమ సస్పెన్షన్లు అక్రమ రిమూవల్స్ ఆపాలి అని,గత నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలి అని,గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని ,మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవు మంజూరు చేయాలి అని,నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని,ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలి అని ,E.H.S స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలి అని,ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం ద్వారా లేదా సంస్థ ద్వారా కొనాలి అని,114 జీవోలో పొందు పరిచిన మేరకు నైట్ అవుట్ అలవెన్స్లను 150 నుంచి 400 వరకు చెల్లింపులు చేయాలి అని,ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థపరంగా వేతనాలు చెల్లించాలి అని, ఏపీఎస్ఆర్టీసీ లో ఉన్న విధంగానే క్యాడర్ స్ట్రెంత్ అమలు చేయాలి ,తీవ్రమైన అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఉద్యోగులకు ఓడీలను కేటాయించాలి ,డిప్టేషన్లను కొనసాగించాలి, ఉద్యోగుల అవసరాన్ని బట్టి ఈఓఎల్ లో మంజూరు చేయాలి ,పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలి ,ఆఫీసు సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి ,రిటైర్ ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణాలను అనుమతించాలి .అధికారులు సానుకూలంగా పరిష్కరించని యెడల,తదుపరి రాష్ట్ర కమిటీ ఇచ్చు పిలుపు మేరకు పూర్తి స్థాయిలో ఆందోళనలు నిర్వహించుటకు బద్వేల్ డిపో కమిటీ సిద్దంగా ఉన్నది అని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బద్వేలు డిపో NMUA working ప్రెసిడెంట్ సూరా జనార్దనరావు , డిపో సెక్రటరీ D. చంద్రయ్య ,CCC డెలిగేట్ K.మల్లికార్జున, సంయుక్త కార్యదర్సులు A.శ్రీధర్,కెవి రమణ,RB రెడ్డి,M bhasker,MS రాయుడు,మరియు తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.