

మనన్యూస్,తిరుపతిఃనక్ష ఫైలెట్ ప్రాజెక్ట్ కింద తిరుపతిలో డ్రోన్ సర్వే ను ఆదివారం ఉదయం వినాయకసాగర్ లో జెండా ఊపి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. డ్రోన్ సర్వే తీరును అధికారులు ఎమ్మెల్యేకి వివరించారు. డిజిటల్ ఇండియా ల్యాండ్స్ రికార్డ్ మానిటరింగ్ ప్రొగ్రాం క్రింద కేంద్ర ప్రభుత్వం నక్ష ప్రాజెక్ట్ కింద తిరుపతిని ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతాలు నక్ష ప్రాజెక్ట్ కు ఎంపికైనట్లు ఆయన చెప్పారు. నక్ష ప్రాజెక్ట్ కింద జరగనున్న డ్రోన్ సర్వేతో ఆక్రమణలకు చెక్ పడుతుందని ఆయన తెలిపారు. దీంతో నగరంలోని చెరువులు, గుంటలు, కాలువల ఆక్రమణకు గురికాకుండా ఉంటాయని ఆయన చెప్పారు. దీంతో నీటి నిల్వలు పెరగడమే కాకుండా కాలుష్య నియంత్రణకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో గత ఐదేళ్ళలో రీసర్వే పేరుతో భూతగాదాలు పెరిగిపోయాయని ఆయన చెప్పారు. రెవెన్యూ శాఖలో పారదర్శకత నక్ష ప్రాజెక్ట్ తో సాధ్యమౌతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రోన్ సర్వే విజయవంతానికి రెవెన్యూ, ఫ్లానింగ్ విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి కమిషనర్ అమరయ్య, ఏసిపి బాలాజీ, జనసేన నాయకులు మంత్రి పురుషోత్తం, మధులత, ఆదం సుధాకర్ రెడ్డి, కెఎంకే లోకేష్, పగడాల మురళీ, ఆముదాల వెంకటేష్, మునస్వామి, లోకేష్, వంశీ, ఆళ్వార్ మురళీ, వెంకటేష్ రాయల్, బాలాజీ, హేమంత్ , టిడిపి నాయకులు ఊట్ల సురేంద్ర నాయుడు, చిన్ని, నరేష్ తదితరలు పాల్గొన్నారు.