సోమిశెట్టి మధుసూదన్‌ కుటుంబానికి తోడుగా ఉంటాం

మనన్యూస్,కావలి:రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10 లక్షల చెక్కు అందజేసిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,ఉగ్రవాదంపై చర్యలకు కేంద్రం సిద్ధం అవుతోంది.ఎంపీ వేమిరెడ్డి
ఉగ్రవాద దాడిలో మృతి చెందిన కావలి పట్టణానికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆదివారం పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి పది లక్షల చెక్కును కావలి ఆర్డిఓ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నేతలు అందజేశారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ…..దేశంలో ఉగ్రవాద దాడి జరగడం దురదృష్టకరమన్నారు. దాడిలో కావలికి చెందిన మధుసూదన్‌ మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ స్థితిగతులను పరిశీలించామని, తప్పకుండా ప్రభుత్వం తరఫున తగిన న్యాయం చేస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన 10 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి అందాల్సిన సదుపాయాలను అందజేసే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే కుటుంబంలో ఒకరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా తాము ప్రయత్నిస్తామని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలకు మేమంతా కట్టుబడి ఉంటామని, పాకిస్తాన్‌పై ప్రతీకారం తీసుకునేందుకు కేంద్రం చూస్తోందన్నారు. ఇప్పటికే సింధూ జలాలను నిలిపివేసిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబంలో పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని వివరించారు.
ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ…..ఉగ్రవాద దాడులు జరగడం దురదృష్టకరమని, మధుసూదన్ రావు మృతి చెందడం కుటుంబానికి తీరని లోటన్నారు. మధుసూదన్ కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం తరఫున 10 లక్షలు చెక్కును అందజేశామని చెప్పారు. పాకిస్తాన్ చర్యలను ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఎదుర్కొందామని, ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారతదేశం ఏకం అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. కని పెంచిన తల్లి,తండ్రులకు వృద్దాప్యం లో చేదోడు గా ఉండాలని విదేశాల్లో ఉన్నత కొలువులను సైతం వదులుకొని వచ్చిన మధుసూదన్ ముష్కరుల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం మనస్సును కలిచివేస్తోందని అన్నారు. మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల ఆలోచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తామని, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా