మత్స్యకారుల తరుపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,కోవూరు:ఆర్ధిక పరిస్థితి అనుకూలించక పోయినా గంగపుత్రులకు యిచ్చిన మాట తప్ప లేదు.మత్స్యకారుల ఖాతాలలో 20 వేల రూపాయలు వేట విరామ భృతి జమ చేశారు.అభివృద్ధిని విస్మరించకుండా సంక్షేమ పధకాలు కొనసాగించడం చంద్రబాబుకే సాధ్యం.మత్స్యకారసేవలో కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
నాటి స్వర్గీయ నందమూరి తారకరామారావు నుంచి నేటి చంద్రబాబు నాయుడు వరకు మత్స్యకారుల సంక్షేమానికి పాటు పడుతున్నది తెలుగుదేశం పార్టీయేనన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం గ్రామంలో ఆమె “మత్స్యకార సేవలో” పధకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఊటుకూరు పెద్దపాళెం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి స్థానిక మత్స్యకారులు ఘనస్వాగతం పలికి స్థానిక వెంకయ్య స్వామీ ఆలయంలో పూజలు నిర్వహించారు. మహిళలు అడుగడుగునా మంగళ హారతులతో ఆత్మీయ స్వాగతం పలికారు. దారి పొడుగూతా పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకుంటూ విజయోత్సవ ర్యాలీని తలపించారు. భారీ గజమాల మరియు విన్నూత్నంగా చేపల మాలతో మత్స్యకార నాయకులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…….. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 20 వేల రూపాయల వేట నిషేధకాల భృతిని గంగపుత్రుల ఖాతాలలో జమ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కోవూరు నియోజకవర్గ మత్స్యకారుల తరుపున ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలించక పోయినా ఓ వైపు అభివృద్ధి మరో వైపు సంక్షేమ పధకాలు అమలు చేయగల సామర్ధం చంద్రబాబు నాయుడు కే వుందన్నారు. మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపాలన్నదే చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. ఫిషరీస్ అధికారులు చొరవ తీసుకొని మత్స్యకారుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని కోరారు. స్థానిక సర్పంచ్ చేసిన వినతి పై స్పందిస్తూ మత్స్య సంపదను సకాలంలో మార్కెట్ కు తరలించుకునేందుకు వీలుగా సముద్రం వరకు సిమెంట్ రోడ్డు వేస్తానని హామీ యిచ్చారు. గతంలో కోవూరు నియోజకవర్గంలో 3 వేల 28 మందికి 3 కోట్ల 2 లక్షల 80 వేల రూపాయలు యిస్తే …కూటమి ప్రభుత్వం వచ్చాక 3 వేల 102 మంది గంగపుత్రులకు 6 కోట్ల 20 లక్షల 40 వేల రూపాయలు వేట విరామ భృతిగా ఇవ్వడం తమ ప్రభుత్వ ఘనతగా కొనియాడారు. అనంతరం అధికారుల సమక్షంలో మత్స్యకార నాయకులకు 6 కోట్ల 20 లక్షల 40 వేల రూపాయల విలువ చేసే చెక్కు అందించారు.ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రజలకు వివరించాలి.
స్థానిక నాయకులు అధికారులు పరస్పర సమన్వయంతో గ్రామాభివృద్ధికి పాటు పడాలని హితోపదేశం చేశారు. వితంతు పెన్షన్ నమోదులో సచివాలయ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రతి నెల 1 వ తేదీన క్రమం యిచ్చే ఎన్ఠీఆర్ భరోసా పెన్షన్, అక్క చెళ్లమ్మలకు ఏడాదికి ఉచితంగా మూడు సిలెండర్లు తదితర ప్రభుత్వ పధకాల గురించి ప్రజలకు వివరించాలని నాయకులు, అధికారులను కోరారు. రానున్న విద్యా సంవత్సరం నాటికి పాఠశాలలో మౌలిక సదుపాయాలతో తల్లిదీవెన పధకం అందించేందుకు మంత్రి లోకేష్ గారు కృషి చేస్తున్నారన్నారు. గత ఐదేళ్లలో అభివృద్ధి జాడే లేని ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో గుంతల రహిత రోడ్లు, గ్రామాలలో జరుగుతున్న నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణాల గురించి ఆమె ప్రజలకు వివరించారు. కోవూరు నియోజకవర్గంలో 22 వేల వరకు నిరక్షరాస్యులు వున్నారని సంపూర్ణ అక్షరాస్యత సాధన కార్యక్రమంలో స్థానిక నాయకులు భాగస్వాములు కావాలని కోరారు. 2,500 ద్వారా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వయోజన విద్యా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మత్స్యకార నాయకులు నాయకులతో పాటు ఫిషరీస్ జెడి నాగేశ్వరరావు, బుచ్చి ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మెన్లు మోర్ల సుప్రజ, నస్రీన్ ఖాన్, ఊటుకూరు పెద్దపాళెం గ్రామ సర్పంచ్ మేకల శేషమ్మ, ఎంపిటిసి బుజ్జమ్మ, జెడ్పిటిసి తుమ్మల లక్ష్మయ్య, టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు చెముకుల శ్రీనివాసులు, పెన్నాడెల్టా చైర్మెన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి,ఇందుకూరుపేట మండల అధ్యక్షులు రావెళ్ల వీరేంద్రనాయుడు, కోడూరు కమలాకర్ రెడ్డి టిడిపి మండల నాయకులు పాశం శ్రీహరి రెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి కోవూరు టిడిపి నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి ఎంపిటిసి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా