

ఏ బి హెల్పింగ్ హాండ్స్ చలివేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్
ఎస్ఆర్ పురం, మన న్యూస్… ఏ బి హెల్పింగ్ హాండ్స్ సేవలు ఎంతో అభినందినీయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు శనివారం ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు క్రాస్ రోడ్ జంక్షన్ లో ఎన్నారై డాక్టర్ భాస్కర్ రెడ్డి చందన దంపతులు ఏ బి హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటుచేసిన చలివేంద్రం ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ ఎస్ ఆర్ పురం మండలంలో ఆటిజం వ్యాధితో పుట్టిన పిల్లలకు ఏ బి హెల్పింగ్ హాండ్స్ ద్వారా ఒక బియ్యం బస్తా 20 రకాల హోమ్ నీడ్స్ అందించడం ఎంతో గర్వించదగ్గ విషయం.. ఎస్ఆర్ పురంమండలంలో 10 కుటుంబాలలో పేదరికంలో ఉన్న పిల్లలను గుర్తించి వారికి సేవ చేయడం ఏబి హెల్పింగ్ హాండ్స్ సేవలను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు టిడిపి జిల్లా నాయకుడు రాజశేఖర్ నాయుడు సాఫ్ట్వేర్ సేతు రెడ్డి టిడిపి యువ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎంపీటీసీ వేమన నాయుడు పెనుమూరు మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు సూరి రెడ్డి సురేష్ ఉదయ్ కుమార్ మైనారిటీ నాయకుడు మాబు భాష మోహన్ నాయుడు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
