

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 26 :– వైస్సార్సీపీ విద్యార్థి విభాగం నేత తౌఫిక్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు. అనంతరం పలువురు స్థానికులకు చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా మజ్జిగ అందజేశారు.చలివేంద్రం ఏర్పాటు ఆలోచన చేసిన తౌఫిక్ ను చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ………..ప్రజల దాహార్తి తీర్చేందుకు.. ఎక్కడికక్కడ వైసిపి నేతలు ముందుకొచ్చి.. చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. అందులో భాగంగా ఈరోజు 39 వ డివిజన్లో స్థానిక విద్యార్థి విభాగం నేత తౌఫిక్ ముందుకొచ్చి చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకర మన్నారు.ప్రజాసేవ చేయడంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లప్పుడు ముందుంటా రని తెలిపారు.
