

మన న్యూస్,తిరుపతిఃమహిళల సాధికారత కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. మహిళలకు ఇచ్చిన ప్రతి హామిని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన తెలిపారు. ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని సిఎన్ సి సెంటర్ లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శనివారం ఉదయం ప్రారంభించారు. బిసి కార్పోరషన్, ఈడబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణను ప్రభుత్వం అందిస్తోంది. తొంభై రోజుల పాటు జరిగే ఈ శిక్షణకు 360మంది మహిళలు ఎంపికైయ్యారు. మహిళలు ఆర్థికంగా నిలబడేందుకు అవసరమైన అన్ని చర్యలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. కుట్టుమిషన్ నేర్చుకోవడం ద్వారా మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడేందుకు వీలుకలుగుతుందని ఆయన చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతిపదికన కుట్టు మిషన్ శిక్షణకు మహిళలను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్స్ ను అందిస్తోందని ఆయన చెప్పారు. అలాగే తల్లికి వందనాన్ని పాఠశాలలు తెరిచేనాటికి అమలు చేస్తుందని ఆయన తెలిపారు. మహిళ సంక్షేమానికి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు నెరువేరుస్తారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ ఈడి శ్రీదేవి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, యాదవ కార్పోరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, నాయిబ్రాహ్మణ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం, డిప్యూటీ మేయర్స్ ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ, పులుగోరు మురళీ, శ్రీధర్ వర్మ, రాజారెడ్డి, ఎస్ కే బాబు తదితరులు పాల్గొన్నారు.