

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) మత్స్యకారుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు అన్నారు.సోమవారం నిజాంసాగర్ మండలంలోని 20 గేట్ల వద్ద నిజాంసాగర్ ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఫిషరీస్ స్టేట్ ఫెడరేషన్ మెట్టు సాయికుమార్ తో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 100% సబ్సిడీతో చేప పిల్లలను చెరువులలో వదలడంతో..కార్మికులకు ఆర్థికంగా ఎదగడానికి వీలుంటుందన్నారు. గత ప్రభుత్వం బీద,బడుగు,బలహీన వర్గాల ప్రజలను దోచుకున్నారని ఆరోపణ చేశారు. నాసి రకం చేప పిల్లలను పంపిణీ చేసి మత్స్యకారులను మోసం చేయరాదని తెలిపారు. అదేవిదంగా అచ్చం పెట్ గ్రామంలోని చేపల ఉత్పత్తి కేంద్రం పునః ప్రారంభించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పార్టీగా కాంగ్రెస్ పార్టీకి సముచిత స్థానం ఉందని అన్నారు. ప్రాజెక్టులో 24.9లక్షల చేప పిల్లల విడుదల లక్ష్యం అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఎకనామి టూరిజం డెవలప్ చేయడం త్వరలో జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏలే.మల్లికార్జున్, అనీష్ పటేల్,మల్లయ్య గారి ఆకాష్,రాము రాథోడ్,గజ్జల కిరణ్,గౌస్ పటేల్,చిట్యాల నారాయణ,సంకు లక్ష్మయ్య,జిల్లా మత్స్యకారుల అధికారి త్రిపతి,తహసిల్దార్ బిక్షపతి,ఎంపిడిఓ గంగాధర్, జిల్లా అధ్యక్షుడు గాదం సత్యనారాయణ,ప్రాజెక్టు మత్స్యకరుల అధ్యక్షుడు బొయి రాములు,తదితరులు పాల్గొన్నారు.
