

మన న్యూస్, చిత్తూరు:-అయ్యప్ప స్వామి దీక్ష నవంబర్ కార్తిక నెల ప్రారంభం సందర్భంగా అయ్యప్ప స్వామి దీక్ష చేసే స్వాములు మండలం రోజులు అనగా 41 రోజులు దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని శబరి మల స్వామి దర్శించుకోవాలని యాదమరి గురుస్వామి మరియు జిల్లా జానపదల కళాకారుల అధ్యక్షులు రామచంద్ర గురుస్వామి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్ష చేసే స్వాములు భక్తిశ్రద్ధలతో నియమనిష్టలను పాటించి ఇరుముడి కట్టుకొని స్వామివారిని దర్శించుకోవాలని అన్నారు. మాల ధరించిన స్వాములు పాటించవలసిన నియమాలు1. వేకువ జామున సాయంత్రం సమయంలో స్నాన ఆచరించి స్వామి నామాన్ని జపించాలని 2. స్వాములు చెడు అల్లట్లకు దూరంగా ఉండాలని 3. కటిక నేల మీదే నిద్రించాలి 4.ఒంటి పూట భోజనం చేసి చేయాలి.5.భజనలు ,పూజా కార్యక్రమాలు నిర్వహించాలి 6.మాల ధరించినప్పుడు ఎదుటివారిని స్వామి లేక అయ్యప్ప అని సంబోధించాలి.7. మాల ధరించిన స్వాములు ఎదుటివారిని హేళన చేయరాదు 8.మండలం లేక 21 రోజులైనా మాల ధరించి ఇరుముడి కట్టుకోవాలి సూచించారు.అయ్యప్ప స్వామి అగ్ని తో సమానం తప్పు చేసిన వారిని అగ్నిల దహిస్తారు. తప్పు చేసిన వారిని శిక్షించి తన భక్తులుగా మారుస్తారు అన్నారు.కఠినమైన దీక్షలను పాటించి శబరిమలై కొండ వెలసిన శ్రీ ధర్మ శాస్త్ర అయ్యన్ అయ్యప్ప స్వామి స్థానం దర్శించుకోవాలని తెలిపారు.