

మన న్యూస్,నిజాంసాగర్, వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ సభను బీఆర్ఎస్ కార్యకర్తలందరూ విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సిడిసి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డిపిలుపునిచ్చారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని బీఆర్ అస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం వరంగల్ రజతోత్సవ సభ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో సభ టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మనోహర్,సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు రమేష్ గౌడ్,పీఎస్ఎస్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్,నాయకులు విఠల్ రెడ్డి, గరబోయిన వెంకటేశం,బేగరి రాజు,బాబ్బార్,తదితరులు ఉన్నారు.