

మన న్యూస్, కోవూరు,ఏప్రిల్ 24:– పశుసంవర్థక శాఖ ఏడీలతో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సమీక్ష
కోవూరు నియోజకవర్గంలో పాడి రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. గురువారం నెల్లూరులోని విపిఆర్ నివాసంలో పశుసంవర్థక శాఖ ఏడీలు, పశువైద్యశాల డాక్టర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన దానా అంశం, పాడి అభివృద్ధిపై సమీక్షలో ఆమె మాట్లాడుతూ…ప్రభుత్వం నూతనంగా అందిస్తున్న పశువుల దానాపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆరా తీశారు. ప్రస్తుతం మండలానికి 5.6 టన్నుల ఫీడ్ అందనుందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రస్తుతానికి ఒక్కో పాడి రైతుకు ఒక బ్యాగ్ చొప్పున అందిస్తామని వివరించారు. పశువుల దానాకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రతి మండలానికి ఫీడ్ అందేలా చూడాలన్నారు. పాడి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న దానాపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఆమె తెలియజేశారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన మినీ గోకులాల పురోగతిపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరా తీశారు. మినీ గోకులాలు త్వరగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరారు. అలాగే అధికారులు ప్రజలు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇందుకూరుపేట ఏడి మురళీకృష్ణ బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రసన్నాంజనేయరెడ్డి కోవూరు కృష్ణమోర్య మారియ అలాగే పశు వైద్యశాలల డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
