మద్యం పాలసీ విధానాలపై జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకు వచ్చిన విప్లవత్మాక మార్పులపై…… చంద్రబాబు నాయుడు చేస్తున్న అబద్ధపు ప్రచారాల మీద ధ్వజమెత్తిన…..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 24:– నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ…………….మద్యం మాఫియా కి వ్యతిరేకంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో పారదర్శకంగా ఉండేలా ఒక మంచి మార్పుని తీసుకు వచ్చారు. అద్భుతమైన ఈ మద్యం పాలసీ మీద చంద్రబాబు నాయుడు తనకి అలవాటు అయిన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు .
దీనికి సంబందించి గత 2024 సెప్టెంబర్ లో ఒక కేసుని ఫైల్ చేసి అక్టోబర్ లో 20 డిస్లరీలపై దాడులు జరిపి 8 నెలలు CID విచారణ చేసి..ఒక్క ఎవిడెన్స్ కూడా టిడిపి ప్రభుత్వం సంపాదించలేకపోయిందని దుయ్యబట్టారు. గత మద్యం పాలసీ విధానాలపై వాసుదేవ రెడ్డి, సత్య ప్రసాద్ రెడ్డి వద్ద తప్పుడు వాంగ్మూలాలను నమోదు చేసి ఆ confession statement ఆదారంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని ఆరోపించారు.గత వైసీపీ ప్రభుత్వం హయాంలో .. ఇదే వాసుదేవ రెడ్డి ఇచ్చిన complaint తో టిడిపి ప్రభుత్వం చేసిన మద్యం కుంభకోణంలో చంద్రబాబు నాయుడుని A3 గా పేర్కొంటూ సిఐడి కేసు నమోదు చేసిందన్నారు. ఆ కేసుకు సంబంధించి cid దగ్గర పూర్తి ఆదారాలు ఉన్నాయని అన్నారు
ఈరోజు ఆ కేసును పక్కదారి పట్టించేందుకే..అదే వాసుదేవ రెడ్డి, సత్య ప్రసాద్ రెడ్డి తో.. తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయించి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైస్సార్సీపీ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణాల్లో కేవలం.. క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరిగాయని.. టిడిపి ప్రజల్లో అవాస్తవాలను ప్రచారం చేయడం దుర్మార్గం అన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణాల్లో.. నిబంధనలకు అనుగుణంగానే క్యాష్ ట్రాన్సాక్షన్ తో పాటు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ అన్నింటిని అందుబాటులో ఉంచామని అన్నారు . క్యాష్ కలెక్షన్ వస్తే ఏ రోజు కలెక్షన్ ని ఆ రోజు బ్యాంకు లో సదరు షాపు లోని ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ APSBC లో డిపాజిట్ చేయడం 100% జరుగుతుంది. ఇది వాస్తవం , ఇప్పుడు టిడిపి ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా.ఇది కాదు అని చెప్పగలరా నిరూపించగలరా అని ప్రశ్నించారు . అది మానేసి ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మద్యం పాలసీ విధానాలను తప్పు పట్టడమే.. పనిగా టిడిపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. టిడిపి ప్రభుత్వం పదేపదే అబద్ధాలు చెబుతూ.. అదే నిజమనే బ్రాంతిలో.. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుందన్నారు.సాఫ్ట్ వెర్ గురించి మద్యం పాలసీ విషయంలో గతంలో టిడిపి తీసుకువచ్చిన ప్రైవేటు సిటెల్ సాఫ్ట్వేర్ ను జగన్మోహన్ రెడ్డి రద్దుచేసి ప్రభుత్వ షాపులకు అనుగుణంగా అద్భుతమైన విశిష్ట సాఫ్ట్వేర్ తీసుకొచ్చి.. మద్యం పాలసీని మరింత పారదర్శకంగా నిర్వహించారని తెలిపారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం కూడా అదే సాఫ్ట్ వెర్ ని ఉపయోగిస్తావుంది. దీని మీద కూడా అసత్యాలు మాట్లాడుతున్నారు.టిడిపి ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా బెల్టు షాపులను తీసుకువస్తే.. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేశారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కొత్త డిస్లరీలను కాని, కొత్త బ్రాండ్ ని కూడా.. తీసుకురాకుండా.. ఉన్న అన్ని డిస్లరీలను కొనసాగించింది ..
గతంలో టిడిపి ప్రభుత్వం తన స్వంత మనుషులు అయిన 4 డిస్లరీలను 50% పైగా స్టాకు ప్రొక్యూర్ మెంట్ చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. గతంలో వైసిపి ప్రభుత్వం మద్యం షాపుల్లో .. ప్రతి ఒక్క మధ్యం సీసా ను స్కానింగ్ చేసి మరి పూర్తి పారదర్శకంగా అమ్మకాలు జరిపేమన్నారు.ఆ డేటా కూడా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ పద్దతి టీడీపీ ఎప్పుడు అమలు చేయలేదు. అంతా దోపిడీ మాత్రమే జరిగింది.టిడిపి ప్రభుత్వంలో ఉన్న 4300 మద్యం షాపులను.. జగన్మోహన్ రెడ్డి ఇళ్ల మధ్యన, మసీదులు, దేవాలయాల దగ్గర ఉండే వాటిని తొలగించి కేవలం 2934 షాపులకు కుదించి.. మద్యం నిత్యం అందుబాటులో ఉండకూడదు అన్న కారణంతో అమ్మకాలు జరిపారని తెలిపారు.జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి.. 20,000 మందికి ఉపాధి కల్పించారని తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ విషయంలో.. అక్రమాలకు పాల్పడ్డమే కాకుండా.. మద్యాన్ని విచ్చలవిడి చేసిందని ఆరోపించారు.
ఈరోజు ప్రజలు వద్దు అని మొత్తుకుంటున్నా టి డి పి ప్రభుత్వం వినకుండా.. ఇళ్ల మధ్య, అపార్ట్మెంట్ల వద్ద, దేవాలయాలు స్కూలు మసీదులు ఉండే ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి.. ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నారని ఆరోపించారు.
మద్యం షాపుల్లో అనధికారికంగా పర్మిట్ రూములు పెట్టి .. 24* 7 అంటే రాత్రి సమయంలో సైతం అమ్మకాలను ప్రోత్సహిస్తూ.. మద్యం అమ్మకాల్లో దుకాణదారులకు 20 % పెంచి టార్గెట్లు పెడుతూ.. మద్యం విచ్చలవిడిగా దొరికే లాగా.. ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దీంతో మద్యం తాగే వారు ఎక్కువయిపోయి.. ఇళ్లల్లో వస్తువులు, మంగళ సూత్రాలు.. కుదువ పెట్టి.. తాగుతూ.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. టిడిపి తీసుకొచ్చిన మద్యం విధానాల వలన.. మద్యం విచ్చలవిడిగా దొరకడంతో.. శాంతి భద్రతలు క్షీణించి.. రోడ్లపైనే హత్యలు చేసుకునే పరిస్థితికి.. ఆంధ్రప్రదేశ్ చేరుకుందన్నారు. ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలో.. మద్యం పాలసీ విధానంలో పూర్తిగా అవకతవకలకు పాల్పడుతూ.. టిడిపి నేతలు తమ జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.
గతంలో చంద్రబాబుపై సిఐడికి.. వాసుదేవ రెడ్డి.. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తే.. ఈరోజు అదే వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ ల వద్ద తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసి..మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పై.. తప్పుడు కేసు బనయించారన్నారు. ఇలా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు నమోదు చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతుందన్నారు. ఇలాంటి కేసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరేది లేదని.. చట్టపరంగా అన్ని ఎదుర్కొంటామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయవలసి వస్తుందనే..కారణంతో టిడిపి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా.. ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..