కాశ్మీర్లో ఉగ్రవాదులు చేతిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ భౌతికాయానికి శ్రద్ధాంజలి కట్టించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర మంత్రులు

మన న్యూస్, కావలి,ఏప్రిల్ 24 :– కాశ్మీర్ లో ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ భౌతికకాయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, కావలి ఎమ్మెల్యే దగు మాటి వెంకట కృష్ణారెడ్డి తదితరులతో కలిసి నివాళులర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ……..కాశ్మీరులో ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య,
మతం పేరు అడిగి చంపేయడం దుర్మార్గం అని అన్నారు. ముష్కరుల చర్యల కారణంగా ఇప్పుడు కాశ్మీర్ లో ఏ మతస్థులు ఆర్థికంగా దెబ్బతిమబోతున్నారు అని తెలిపారు.ఉగ్రవాదులు కానీ వారిని ప్రోత్సహించే సంస్థలు, దేశానికి ధైర్యముంటే నేరుగా వస్తే ఎదుర్కొనే సత్తా భారత్ కు ఉంది అని లియజేశారు.భార్యాబిడ్డలతో విహారానికి వచ్చిన వారిని మతం, దేశం పేరు అడిగి చంపేసే పిరికి వాళ్లను ఎప్పుడూ చూడలేదు అని అన్నారు.మతాలకు అతీతంగా ప్రపంచమంతా ఈ ఘటనను ఖండిస్తోంది అని తెలియజేశారు. మనుషులను చంపేసి మోదీకి చెప్పుకోండని చెప్పిన ముష్కరులు అసలు మనుషులేనా..వారిది మానవజన్మేనా అని తెలిపారు. భారతదేశం జోలికి వచ్చినోళ్లను ప్రధాన నరేంద్రమోదీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు..పాపాత్ములు ఫలితం అనుభవింక తప్పదు అని అన్నారు.
కనీసం చనిపోయిన వారికి సానుభూతిని కూడా చెప్పాల్సిన రీతిలో పాకిస్థాన్ చెప్పలేకపోయింది అని అన్నారు.కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సోమిశెట్టి మధుసూదన్, చంద్రమౌళితో పాటు పలువురు ఉగ్రదాడికి బలైపోవడం బాధాకరం అని అన్నారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..