

Mana News, శ్రీకాళహస్తి.:-ప్రపంచానికి పెను ప్రమాదకరంగా మారిన వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నశించాలని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం నాయకులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. కాశ్మీర్ లోని పహల్గమ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఏపీ వాసులైన చంద్రమౌళి, మధుసూధనరావులు మరణించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఈరోజు స్థానిక పూసల వీధి కూడలిలో వారి చిత్రపటాల ముందు కొవ్వొత్తులను వెలిగించి నివాళులు అర్పించారు. ఉగ్రవాద దాడి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కార్యక్రమంలో పాల్గొన్నవారు మాటిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ సమాజానికి పెను ముప్పుగా పరిణమించిన తీవ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయకపోతే అది మానవ మనుగడను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. కాబట్టి,ప్రపంచ లోని ఏ ప్రాంతంలో నైనా తీవ్రవాదాన్ని అంతమొందించడానికి ప్రతీ ఒక్కరూ సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి వారి గురవారెడ్డి,రాష్ట్ర కార్యదర్శులు దశరధాచారి,వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి డైరెక్టర్ మిన్నల్ రవి, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, సీనియర్ నాయకులు లక్కమనేని మధుబాబు, పేట బాలాజీ రెడ్డి, రాజేంద్రప్రసాద్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి,తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, బిసి విభాగం శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షుడు దొరైరాజ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్, మైనారిటీ విభాగం తిరుపతి పార్లమెంటు నాయకుడు సయ్యద్ చాంద్ బాషా, నూర్ మొహమ్మద్, షేక్ రియాజ్, సులేమాన్, బిసి విభాగం నాయకులు భాస్కర్, మణి, వినయ్, మునెయ్య, సోము, చంద్ర, కృష్ణమూర్తి, రఫీ, బిజెపి నాయకులు జలగం ముని, నితిన్ తదితరులు పాల్గొన్నారు.
