

మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 23: రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించిన జనసేన పార్టీ కావలి క్రియాశీలక సభ్యుడు కోలా కమలేష్ సంస్మరణ సభ కు జనసేన జిల్లా నాయకులు చేసి నివాళులర్పించారు.
మనతోపాటు మరెందరో జీవితాలను మార్చగల శక్తి పవన్ కళ్యాణ్ కి ఉంది అని నమ్మి నడిచిన నేస్తం ఇక లేరు… జనసేన పార్టీ సభ్యులందరూ కులమతాలకు అతీతంగా ఒకే తాటిపై నిలబడి కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలబడాలని మనస్పూర్తిగా కోరుతున్నాము . గత ఆరు సంవత్సరాల నుంచి ఏ చిన్న కార్యక్రమం జనసేన పార్టీ తరఫున ఉన్నా ఎంతో ఉత్సాహంగా పాల్గొనే కోలా కమలేష్ ఇకలేరు అనే నిజాన్ని నమ్మలేకున్నాం.. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలైపుతున్నాము. అనివార్య కారణాల వలన జిల్లా బాధ్యులు వేములపాటి అజయ్ ఇక్కడికి రానప్పటికీ,త్వరలో కుటుంబాన్ని కుటుంబ సభ్యులను కలిసి వారికి అండగా నిలబడతారు. అని తెలిపారు.