

Mana News :- గొల్లప్రోలు పట్టణ పరిధిలోని గవర్నమెంట్ గరల్స్ హైస్కూల్ విద్యార్థినిలు విశేష ప్రతిభ చాటారు.జిల్లాలోని ప్రభుత్వ హైస్కూల్ లను తోసి రాజుని గొల్లప్రోలు ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ బాలికలు విజయదుందభి మోగించారు.పదవతరగతి పరిక్షాపలితాల్లో 600/ కు గానూ 594 మార్కులు సాధించిన తోట పుష్పాంజలి ని, ప్రధాన ఉపాధ్యాయుడు చింతా సూర్య ప్రకాష్ రెడ్డి ని పలువురు అభినందించారు.అలాగే 600 వందలకు గాను 590 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచిన ఆకేటి కనకవల్లిని అభినందించారు.గరల్స్ హైస్కూల్ విద్యార్థినిలు పదోతరగతి పరీక్షలకు 116 మంది హాజరు కాగా 18 మంది ఫెయిల్ అయ్యాను.మిగతా విద్యార్థినిలు అందరు అత్యధిక మార్కులు సాధించి గొల్లప్రోలు కు మంచి పేరు తీసుకూవచ్చారు.విద్యార్దినులనుండి ఉత్తమ ఫలితాలు రాబట్టడంలో ఉపాద్యాయులు ఓరుగంటి పాపారావు,ఉప్పాల మహేష్, అరుణ శ్రీ, పుణ్య మంతుల రాజ్యలక్ష్మి, ఎమ్.సుధారాణి, యామిని ప్రసాద్,ఉమా మంగతాయారు, ఉమాదేవి తదితరులు విద్యార్దిని లను తీర్చదిధ్దినట్లు తెలిపారు.గొల్లప్రోలుకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన విద్యార్దిని లను పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు.