

కలిగిరి మన న్యూస్ :: కలిగిరి పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శిరోభూషణం భీమేశ్వర పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కావించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు శిరోభూషణం భీమేశ్వర రావు ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాఠశాల నిర్వహణ సక్రమంగా ఉండేలా నైపుణ్యతగా నిర్వర్తించారని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన పదవీకాలంలో అనేకమంది విద్యార్థులను వారి జీవితాలను ఒక గమ్యాన్ని చూపించి వెలుగును పంచారన్నారు. ఉపాధ్యాయుడు అంటే ఇంటికి తండ్రి ఎలాంటి వాడో పాఠశాలకు అలాంటి వాడని వారన్నారు. పదవీ విరమణ జీవితంలో ఒక భాగం అన్నారు. ఆయన విశ్రాంతి సమయంలో ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం స్థానిక మండల నాయకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు.