వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..

Mana News :- ‘దేవర’ లాంటి ఒక బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఒక సినిమా తెరకెక్కుతన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ లేకుండానే ప్రశాంత్ నీల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు. ఇప్పుడు తదుపరి షెడ్యూల్‌లో జూనియర్ ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం మంగళూరులో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. సినిమాకు అత్యంత కీలకమైన ఈ షెడ్యూల్‌లో ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..Also Read : Satya : ‘రావు బహదూర్’ గా వస్తున్న సత్యదేవ్.. ఈ సినిమాకు ఎన్టీఆర్‌తో పాటు ప్రశాంత్ నీల్ కూడా భారీ ఎత్తున రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారు. హోంబాలే బ్యానర్ నుంచి బయటకు వచ్చి ప్రశాంత్ నీల్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో కాస్త గట్టిగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడట. దానికి మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒప్పుకుంది. ఒక పక్క మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తుండగా, హీరో తరఫున ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా సహ-నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ఒక టాప్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ అయిన టీ-సిరీస్ కూడా ఈ ప్రాజెక్టులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు, ఈ సినిమాలో టీ-సిరీస్ సంస్థ పెట్టుబడులు పెట్టినందుకు గానూ, నాన్-థియేట్రికల్ రైట్స్ దక్కించుకోబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాజెక్టుల నుంచి మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు టీ-సిరీస్ కలిసి పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Related Posts

మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 1 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 2 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు