ఆరేళ్ల కల సీఎం చంద్రబాబుతో సాకారం

మనన్యూస్,తిరుపతి:డీఎస్సీ అభ్యర్థుల ఆరేళ్ల కలను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు విద్యాశాఖామంత్రి నారా లోకేష్ సాకారం చేశారని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీని విడుదల చేసి ఇది మంచి ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుందన్నారు.ఈ సందర్భంగా తిరుపతి ఆర్డీఓ ఆఫీసు ఎదుట డీఎస్సీ విడుదల సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులతో కలిసి చంద్రబాబు, లోకేష్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
వారి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. థ్యాంక్యూ సీఎం సర్, లోకేష్ అన్న అంటూ ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులు ప్లకార్డులు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఇదే ప్రాంతంలో అభ్యర్థులతో కలిసి అనేక నిరసనలు, ధర్నాలు చేపట్టామని, కనీసం పట్టించుకున్న దాఖలాలులేవన్నారు. అభ్యర్థులు ఆర్తనాదాలు పెట్టినా స్పందించలేదన్నారు. కూటమి అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు, లోకేష్ లు నెరవేర్చి అభ్యర్థులకు అండగా నిలిచారన్నారు. అన్ని కేటగిరీలకు న్యాయం జరిగేలా డీఎస్సీ రూపొందించారన్నారు. అనంతరం తిరుపతి పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు కొట్టే హేమంత్ రాయల్ మాట్లాడుతూ డీఎస్సీ విడుదల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని, అన్న విధంగానే సంవత్సరంలోనే 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. ఆరేళ్లుగా నిరీక్షించి అలసిపోయిన అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా మాజీ సీఎం జగన్ రెడ్జి బుద్ధి తెచ్చుకోవాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర సభ్యులు ఆర్కే నాయుడు, విష్ణు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    నేటి నుంచి ఆంధ్ర హైకోర్టు సాధన,సమితి కోసంఆందోళన

    ఉరవకొండ మన ధ్యాస: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో కర్నూలులో ఉద్యమం మళ్లీ వేడెక్కుతోంది. కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న ఒక హోటల్‌లో సోమవారం సాయంత్రం హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో సుమారు 50 మంది న్యాయవాదులు…

    దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెలిసి ఉన్న అమ్మ వారి ప్రాంగణంలో దసరా సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గమ్మ వారి దేవీ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీవో కి వినతి….//

    • By NAGARAJU
    • September 15, 2025
    • 5 views
    మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీవో కి వినతి….//

    ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు కావలి ఆర్టీవో మురళీధర్…

    • By NAGARAJU
    • September 15, 2025
    • 3 views
    ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు కావలి ఆర్టీవో మురళీధర్…

    నేటి నుంచి ఆంధ్ర హైకోర్టు సాధన,సమితి కోసంఆందోళన

    నేటి నుంచి ఆంధ్ర హైకోర్టు సాధన,సమితి కోసంఆందోళన

    సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

    • By RAHEEM
    • September 15, 2025
    • 3 views
    సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

    జలదంకి లో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీవర్ధన్ భౌతికకయానికి నివాళులు అర్పించిన కొట్టే వెంకటేశ్వర్లు….

    • By NAGARAJU
    • September 15, 2025
    • 7 views
    జలదంకి లో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీవర్ధన్ భౌతికకయానికి నివాళులు అర్పించిన కొట్టే వెంకటేశ్వర్లు….

    ముస్లిం సోదరుడు యాకుబ్ భాషా వివాహ వేడుకలకు హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    • By NAGARAJU
    • September 15, 2025
    • 5 views
    ముస్లిం సోదరుడు యాకుబ్ భాషా వివాహ వేడుకలకు హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!