నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపే కూటమి ప్రభుత్వం- మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలే దీనికి నిదర్శనం – చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

Mana News, చిత్తూరు ;- 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడిన కూటమి ప్రభుత్వం.., మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి.., నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్దమైందనీ..ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన పాలనకు నిదర్శనమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా.. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసింది..ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీను నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధిని సోమవారం
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు సోమవారం ఓ ప్రకటనలో అభినందినలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ఎనలేనిది అన్నారు. మరీ ముఖ్యంగా నిరుపేదలు లేని సమాజ స్థాపనే ఆయన లక్ష్యమని చెప్పారు. అదేసమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టి.., తాజాగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి..,16347 ఉపాద్యాయ ఉద్యోగాల భర్తీకి కంకణం కట్టుకోవడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతకు నిలువెత్తు నిదర్శనం అని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ప్రశంసించారు. ఇకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.., విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు.. ఇందులో కీలక పాత్ర పోషించి.., రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయడం శుభపరిణామమన్నారాయన. 2047 విజన్ తో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజా దీవెనలు మెండుగా ఉన్నాయన్నారు.

Related Posts

నేటి నుంచి ఆంధ్ర హైకోర్టు సాధన,సమితి కోసంఆందోళన

ఉరవకొండ మన ధ్యాస: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో కర్నూలులో ఉద్యమం మళ్లీ వేడెక్కుతోంది. కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న ఒక హోటల్‌లో సోమవారం సాయంత్రం హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో సుమారు 50 మంది న్యాయవాదులు…

దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెలిసి ఉన్న అమ్మ వారి ప్రాంగణంలో దసరా సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గమ్మ వారి దేవీ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీవో కి వినతి….//

  • By NAGARAJU
  • September 15, 2025
  • 5 views
మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీవో కి వినతి….//

ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు కావలి ఆర్టీవో మురళీధర్…

  • By NAGARAJU
  • September 15, 2025
  • 3 views
ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు కావలి ఆర్టీవో మురళీధర్…

నేటి నుంచి ఆంధ్ర హైకోర్టు సాధన,సమితి కోసంఆందోళన

నేటి నుంచి ఆంధ్ర హైకోర్టు సాధన,సమితి కోసంఆందోళన

సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

  • By RAHEEM
  • September 15, 2025
  • 3 views
సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

జలదంకి లో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీవర్ధన్ భౌతికకయానికి నివాళులు అర్పించిన కొట్టే వెంకటేశ్వర్లు….

  • By NAGARAJU
  • September 15, 2025
  • 7 views
జలదంకి లో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీవర్ధన్ భౌతికకయానికి నివాళులు అర్పించిన కొట్టే వెంకటేశ్వర్లు….

ముస్లిం సోదరుడు యాకుబ్ భాషా వివాహ వేడుకలకు హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

  • By NAGARAJU
  • September 15, 2025
  • 5 views
ముస్లిం సోదరుడు యాకుబ్ భాషా వివాహ వేడుకలకు హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!