

మన న్యూస్, నారాయణ పేట: ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా తెలిపారు. మక్తల్ మండల పరిధిలోని కార్ని గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మక్తల్ నియోజకవర్గం వైద్య , విద్యకు వెనుకబడిన ప్రాంతమని ఇక్కడి ప్రజలు చాలా బిదరికానికి చెందిన వారని ఇటువంటి అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకొవాలని,తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేటట్లు నిరంతరం శ్రమిస్తూ నేడు ఎమ్మెల్యే గారి సహకారంతో రామ్ రెడ్డి లయన్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో వాకిటి శ్రీహరి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో మక్తల్ మండలం కర్ని గ్రామంలో నిర్వహించడం జరిగిందని అన్నారు. 100 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించగా 45 మందికి పైన కంటిపుర సమస్యలు ఉన్నట్లు గుర్తించి వారిని ఆపరేషన్ నిమిత్తం మహబూబ్నగర్ రామ్ రెడ్డి లయన్స్ హాస్పిటల్కు ప్రత్యేక వాహనంలో తరలించడం జరిగిందన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నియోజకవర్గంలో ప్రతి మండలంలో కంటి వైద్య శిబిరాలతో పాటు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడంలో ఎమ్మెల్యే గారి సహకారం పట్ల కర్ల గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు. కంటి చూపు లోపం ఉన్నవారికి వయవృద్ధులైనటువంటి వారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ కంటి ఆపరేషన్తో పాటు ఉచితంగా మందులు అద్దాలు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాసం నరసింహ, పోతురాజు లక్ష్మయ్య, మల్లేష్,శీను, ఆకాశరాములు,మైబు, ఏ రవికుమార్, నూరుద్దీన్, అసుముద్దీన్, బోయ, నరసింహ, ఆఫ్రోజ్,సద్దాం తదితరులు పాల్గొన్నారు.
