

Mana News ;- BrahMos Missile:రక్షణ ఎగుమతుల రంగంలో భారత్ మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది.మన అమ్ములపొదిలోని అత్యంత పవర్ఫుల్ వెపన్,సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించిన రెండవ బ్యాటరీ ఫిలిప్పీన్స్‌కు దిగుమతి చేసింది. ఏప్రిల్ 2024లో భారత వాయుసేన విమానం ద్వారా మొదటి విడత క్షిపణులను పంపగా, తాజా షిప్మెంట్ సముద్ర మార్గం ద్వారా జరుగుతోంది.ఇది భారత్ ఫిలిప్పీన్స్‌తో చేసుకున్న సుమారు ₹3100 కోట్ల ($375 మిలియన్లు) భారీ ఒప్పందంలో భాగం. ఈ ఒప్పందం కింద, భారత్ మూడు బ్రహ్మోస్ క్షిపణి బ్యాటరీలు, లాంచర్లు మరియు సంబంధిత పరికరాలను ఫిలిప్పీన్స్‌కు సరఫరా చేయనుంది. బ్రహ్మోస్… ఎందుకింత స్పెషల్? బ్రహ్మోస్ క్షిపణి, భారత్ యొక్క డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)- రష్యాకు చెందిన NPO మషినోస్ట్రోయేనియా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఒక అత్యాధునిక కిల్లర్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి.ఇది ధ్వని వేగం కన్నా దాదాపు మూడు రెట్లు (మాక్ 2.8) అధిక వేగంతో దూసుకుపోగలదు.భూమి,సముద్రం మరియు గగనతలం నుండి కూడా దీనిని ప్రయోగించే సామర్థ్యం దీని సొంతం. సింపుల్‌గా చెప్పాలంటే, శత్రువుకు రియాక్ట్ అయ్యే టైమ్ కూడా ఇవ్వదు. భూమి, సముద్రం, గగనతలం ఇలా ఎక్కడి నుంచైనా దీన్ని ఫైర్ చేయొచ్చు.ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..ఈ క్షిపణిలోని 83 శాతం భాగాలను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది,ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ కు నిదర్శనం. వరల్డ్ వైడ్ హాట్ కేక్… మన బ్రహ్మోస్! బ్రహ్మోస్ క్షిపణులను దిగుమతి చేసుకోవడానికి భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్న మొదటి విదేశీ భాగస్వామి ఫిలిప్పీన్స్ కాగా, ఇప్పుడు అనేక ఇతర దేశాలు కూడా ఈ శక్తివంతమైన క్షిపణిపై ఆసక్తి చూపుతున్నాయి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ASEAN) గ్రూపులోని దేశాలు, కొన్ని గల్ఫ్ దేశాలు భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఉత్సాహం కనబరుస్తున్నాయి. ఇండోనేషియా అయితే ఏకంగా $450 మిలియన్ల (సుమారు ₹3750 కోట్లు) డీల్ కోసం భారత ప్రభుత్వానికి లేఖ కూడా రాసిందనే టాక్ వినిపిస్తోంది. వియత్నాం, మలేషియా, UAE, చిలీ, సౌత్ ఆఫ్రికా… ఇలా ఇంట్రెస్ట్ చూపిస్తున్న దేశాల లిస్ట్ చాంతాడంత ఉంది. DRDO చీఫ్ కామత్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. గేమ్ ఛేంజర్ ఎందుకంటే… ఇండియా ఇప్పుడు గ్లోబల్ ఆయుధ మార్కెట్లో ఒకప్పుడు కొనే దేశం స్థాయి నుంచి, ఇప్పుడు పవర్ఫుల్ వెపన్స్ అమ్మే దేశంగా ఎదుగుతోంది.ఇది చాలా పెద్ద విషయం.ముఖ్యంగా,దక్షిణ చైనా సముద్రంలో చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న సమయంలో, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు మన బ్రహ్మోస్ క్షిపణులను ఇవ్వడం వ్యూహాత్మకంగా చాలా కీలకం.ఇది మన రక్షణ దౌత్యంలో ఒక కొత్త పవర్ గేమ్‌కు సిగ్నల్ లాంటిదని చెప్పొచ్చు.
