

మనన్యూస్,కావలి:దగదర్తి మండల కేంద్రంలో వేలాది మంది మహిళలు ,అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాలేపాటిసుబ్బానాయుడు, రవీంద్రనాయిడు,బాను.ముఖ్యమంత్రి నారాచంద్రబాబు జన్మదినం సందర్భంగా 2000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసిన మాలేపాటి సోదరులు.ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజనరీ నాయకుడు…అమరావతి రూపశిల్పి
రాష్ట్రం అభివృద్ది చెందాలంటే చంద్రబాబు , లోకేష్ బాబుతోనే సాధ్యం అని అన్నారు.
దగదర్తి మండల కేంద్రంలో యువ నాయకుడు నారా లోకేష్ బాబు, నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాలని ఆవిష్కరిస్తాం అని తెలిపారు.మాలేపాటి కుటుంబం తెలుగుదేశం పార్టీకి అంకితం.
కావలి తెలుగుదేశం పార్టీలో ఏ సమస్యలు లేవు.. చిన్న ,చిన్న సమస్యలు ఉన్నా అందరం కలిసి పరిష్కరించుకుంటాం అని అన్నారు.
కావలి నియోజకవర్గం , దగదర్తి మండలం అభివృద్ధి చెందటమే మా అజెండా,కలిసి పనిచేసి అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం అని తెలియజేశారు.