

మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) జొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి మల్లూర్ సొసైటీ చైర్మన్ కళ్యాణి విఠల్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని మల్లూరు సహకార సంఘం ఆధ్వర్యంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి తూకాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరుకాలం క్షమించి పండించిన పంటను దళారులను నమ్మే మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని జొన్నను విక్రయించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ సాయిలు, డైరెక్టర్ లు విఠల్ రెడ్డి,వెంకట్ రాంరెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజారాం, కృష్ణారెడ్డి,బుడిమి శ్రీనివాస్, సాయిలు,తదితరులు ఉన్నారు.