క్రీస్తు పునరుద్దానుడు..కత్తిపూడిలో రన్‌ఫర్ జీసెస్…

శంఖవరం మన న్యూస్ (అపురూప్): క్రీస్తు పునరుద్దానుడు, సజీవుడు మరణమును జయించిన సందర్భంగా క్రీస్తును గూర్చి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టి ఎన్టి యుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) అన్నారు. గుడ్‌ఫ్రైడే, ఈస్టరు పండుగలు సందర్భంగా శంఖవరం మండలం సేవకులు, క్రైస్తవ విశ్వాసుల ఆద్వర్యంలో కత్తిపూడిలో రన్‌ఫర్ జీసెస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టి ఎన్టి యుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ), గ్రామ సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ, దడాల బాబ్జి తదితరులు జండా ఊపి రన్ ఫర్ జీసస్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు క్రీస్తు బోధనాలు, సిలువ మరణము, పునరుద్దానము గూర్చి కొనియాడారు. ప్రభువైన క్రీస్తు కృపా కాపుదల కత్తిపూడి గ్రామమంతట ఉండాలని కోరారు.అనంతరం వైద్యులు పెదపాటి ఆనంద్ మాట్లాడుతూ, 2015 వ సం. నుండి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, పది సంవత్సరాలు దేవుని కృప, గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శంఖవరం మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవకులకు, క్రైస్తవ సభ్యులకు కత్తిపూడి యువతకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామ తెలుగుదేశం పార్టీ పెద్దలు వెన్న శివ, సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ, శంఖవరం ది. ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు కె. హరినాథ్ ను ఘనంగా సన్మానించారు. మాజీ యువకులు, చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాల్గొన్నవారికి బహుమతులు అందజేసారు. రన్‌ఫర్ జీసెస్ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు దువ్వాడ సాల్మాన్‌రాజు, శంఖవరం మండలం పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎం. భాస్కరరావు, దడాల యాకోబు, పాస్టర్ ఎమ్. ప్రకాష్, అధ్యక్షులు ఎలీషా, కార్యదర్శి పి.టి. పౌల్, , తాతపూడి జోసెఫ్, తిరగటి సతీష్ టి సన్నీ, నందికోళ్ళ హారీష్, యస్ అనిల్, కూటమి నేతలు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///