

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) పిట్లం మండల కేంద్రంలో గురువారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో కల్తీకల్లు,గంజాయి పై అవగాహన కార్యక్రమం అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించారు.ఈ సందర్భంగా నార్కోటిక్ సీఐ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.
గంజాయి మరియు కల్తీ కల్లుని నిర్మూలిద్దాం మన సమాజాన్ని కాపాడుకుందాం అని పేర్కొన్నారు.గంజాయి మరియు కల్తీకల్లు అల్ట్రాజోలం & డైజోఫార్మ్, త్రాగటం వలన ప్రాణం పోతుందని యువత, ప్రజలు వీటికి దూరంగా ఉండాలని సూచించారు.డ్రగ్స్ మరియు కల్తీకల్లు అల్ట్రాజోలం,మరియు డైజోఫామ్, కు సంబంధించిన ఏదైనా సమాచారం ఇవ్వాలనుకుంటే మా టోల్ ఫ్రీ నంబర్ (1908) కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ ఐ నగేష్,పిట్లం ఎస్ ఐ రాజు, ఏఎస్ఐ రాచప్ప, జందార్ సాయ గౌడ్,డాక్టర్ పూజ, కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి,మొగుల గౌడ్, సిబ్బంది ఇతర మండల స్థాయి అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.