అన్ సర్వే భూములను సర్వే చేసి గిరిజనులకు పట్టాలి ఇవ్వాలి

మన న్యూస్ సాలూరు ఏప్రిల్19:– పార్వతిపురం మన్యం జిల్లా ఈనెల 21న జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ మండలంలో కొత్తూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో అటవీ, బంజర భూములు సర్వే చేసిన వారందరికీ పట్టాలు పంపిణీ చేయాలి సర్వే చేసిన వారికి పూర్తిస్థాయిలో పట్టాలు పంపిణీ చేయలేదని తెలిపారు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పట్టాలు పంపిణీ చేయకపోవడం వలన గిరిజనులు పేదలు నష్టపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా పట్టాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో జిల్లేడు వలస బోర్రపనుకువలస పట్టాలు ఇవ్వాలని పోరాటం చేసిన సందర్భంలో కలెక్టర్ ఉన్నతాధికారులు ఇచ్చిన హామీని అమలు చేయలేదని తెలిపారు .ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు .మండలంలో అనేకమంది గిరిజన రైతులు పేద రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని తెలిపారు. అటువంటి వారందరికీ సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సారిక, జిల్లేడు వలస, డొంకల వెలగవలస, కొటియా సరిహద్దు గ్రామాల అన్ సర్వేడు భూములను సర్వేలు చేసి పట్టాలు ఇవ్వాలని కోరారు దశాబ్దాలు కాలంగా అన్సర్వేడు భూములు సరిగా సర్వేలు చేయకపోవడం వలన గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అన్సర్వేడు భూములన్నీ సర్వేలు చేసి గిరిజన రైతులకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. భూ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 21 న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమములో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం సీనియర్ నాయకులు సుకురు గంగయ్య మండల కమిటీ సభ్యులు చింత జోగయ్య గేమ్మెల తిరుపతి బాడమ్మ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యులు చింతా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి