

మన న్యూస్,నిజాంసాగర్, దళారులను నమ్మి మోసపోవద్దని ఉద్దేశంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు విక్రయించాలని సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి అన్నారు.నిజాంసాగర్ మండలంలోని అచ్చంపెట్
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని వెల్గనూర్ గ్రామంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్వింటాలుకు రూ.3371 మద్దతు ధర ప్రభుత్వం తెలుస్తుందని ఆయన తెలిపారు. ఎకరానికి ఎమ్మెల్యే కొంటెల్ల జొన్నలు కొనుగోలు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి, మాజీ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు రమేష్ గౌడ్,మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్,మాజీ సర్పంచ్ గరబోయన వెంకటేశం, మాజీ ఉపసర్పంచ్ల పోరం అధ్యక్షులు హనుమంతు రెడ్డి,సొసైటీ సీఈఓ సంగమేశ్వర్ గౌడ్, డైరెక్టర్లు తదితరులున్నారు.