

పాచిపెంట, నవంబర్ 16( మన న్యూస్):=
పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలం లో పంచగవ్య తో అన్ని రకాల పంటలు నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని పాచిపెంట వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. శనివారం నాడు మండలం విశ్వనాధపురం గ్రామంలో రైతు కిర్ల నాగభూషణరావు ఒక ఎకరా మామిడి తోట కోసం ప్రకృతి సేద్య ప్రతినిధి విజయ్ ఆధ్వర్యంలో పంచగవ్య తయారీ చేయించారు.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పంచగవ్య ను అన్ని పంటలపై పూత దశ మరియు పిందె దశలలో రెండుసార్లు పిచికారి చేసుకుంటే కనీసం 20 శాతం అధిక దిగుబడులు సాధించవచ్చునని అన్నారు.ప్రయోగపూర్వకంగా నిరూపణ జరిగిందని తెలిపారు. ముందుగా ఐదు కిలోల ఆవు పేడలో అరకిలో నెయ్యి వేసి కలిపి వారం రోజులు ఉదయం సాయంత్రం కలిపి ఉంచాలన్నారు.వారం రోజుల తర్వాత ఈ మిశ్రమానికి కొబ్బరి నీళ్లు, రెండు కిలోల బెల్లం, మూడు లీటర్ల పాలు, రెండు లీటర్ల పెరుగు రెండు లీటర్ల బాగా పులిసిన జీలుగ కళ్ళు గాని ఈస్ట్ మిశ్రమం బాగా మగ్గిన 12 అరటిపళ్ళు శుభ్రంగా కలిపి 15 రోజులపాటు ఉదయం సాయంత్రం కలుపుతూ ఉంచాలన్నారు.అనంతరం దీనిని వడగట్టి ఒక లీటరు నీటికి నాలుగు నుంచి ఐదు వడగట్టిన పంచగవ్య కలుపుకొని అన్ని పంటలపై పిచికారి చేసుకోవాలన్నారు.15 రోజుల వ్యవధిలో రెండవసారి కూడా పిచికారి చేసుకున్నట్లయితే రంగు రుచి నాణ్యతతో కూడిన 20 శాతం అధిక దిగుబడులు పొందడమే కాకుండా పంటకు తెగుళ్ళను తట్టుకునే శక్తి కలుగుతుంది.అని మార్కెట్లో దొరికే అన్ని రకాల గ్రోత్ మందుల కంటే కూడా ఇది ఎంతో నాణ్యమైన సహజ సిద్ధమైన గ్రోత్ ప్రమోటర్ అని వ్యవసాయ అధికారి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు బోను మోహన్ ప్రకృతి వ్యవసాయ ఎఫ్ ఎస్ కేరళ శాంతకుమారి పాల్గొన్నారు.