

మనన్యూస్,తిరుపతి:విద్యార్థులు చిన్నప్పటినుంచే క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలని తిరుపతి ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు. గురువారం కొర్లగుంట లోని నగరపాలక ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం ప్రధానోపాధ్యాయురాలు ఎం జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపవిద్య శాఖ అధికారి బాలాజీ, ఎంఈఓ 2 భాస్కర్ నాయక్, అక్కారం పల్లి ఎం సి పి ఎస్ స్కూల్ హెచ్ఎం హరిప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ మాట్లాడుతూ పాఠశాలలో పిల్లలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగిందని, నాణ్యమైన విద్యను బోధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. పిల్లలను పాఠశాలలకు విధిగా పంపే అలవాటును తల్లిదండ్రులు అలవర్చుకోవాలని, పాఠశాల ఆవరణం లోకి వచ్చిన తర్వాత వారికి విద్య బుద్ధులను నేర్పడం మా ఉపాధ్యాయుల వంతు అని చెప్పారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి టు భాస్కర్ నాయక్ మాట్లాడుతూ మొదటినుంచి కొర్లకుంట నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఎక్కువమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, విద్యార్థులకు అనుగుణంగా బోధన పద్ధతులను ఉపాధ్యాయులు బోధిస్తున్నారన్నారు. విద్యతో పాటు శారీరక దృఢత్వం ఏర్పడేందుకు ఆటల పోటీలు ప్రతిరోజు సాయంత్రం ఒక గంట పాటు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయురాలు ఎం జ్యోతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గత వారం రోజులుగా విద్యార్థులకు క్రీడలతోపాటు సంస్కృతిక పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ జీవిత, విజయవాణి ప్రింటర్స్ ,విద్యాసంస్థల ప్రతినిధి మౌనిక ఆర్థిక సహకారం తో విద్యార్థులకు నోట్ బుక్స్, స్టోరీ బుక్స్ వితరణ చేయడం జరిగింది. అంగన్వాడి ఉపాధ్యాయురాలు శాంతి, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.
