

మనన్యూస్,గూడూరు:దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుజువు చేశారు అని తెలియజేశారు.ఎస్సీ ఉప వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయం. గతంలో రాజీవ్ రంజాన్ మిశ్రా ఇచ్చిన నివేదిక, దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించింది. వీటి ప్రకారం 200 పాయింట్ల రోస్టర్ అమలుకు నిర్ణయించింది.త్వరలో విడుదల చేయనున్న డీఎస్సీ నోటిఫికేషన్ తోనే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సమానంగా అందేలా
కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని అన్నారు.ఎస్సీ ఉపవర్గీకరణ కింద గ్రూప్-1లో 12 ఉపకులాలకు 1శాతం, గ్రూపు-2లో 18 ఉపకులాలకు 6.5 శాతం,
గ్రూపు-3లో 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా ఆమోదం తెలింపింది.దళితులు, గిరిజనులను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యల్డ్ తెగలుగా గుర్తించి సమాన అవకాశాలను అందించే లక్ష్యంతో రాజ్యాంగం ఆర్టికల్ 16(4)తో రిజర్వేషన్లను తీసుకొచ్చింది.
మాల, మాదిగ సహా 59 కులాలు, ఉపకులాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణ వివాదం మొదలైంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్డ్ కులాల్లో సంఖ్యాపరంగా మాల, మాదిగలు ఎక్కువగా ఉన్నారు.2001 జనగణన ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లోని షెడ్యూల్డ్ కులాల్లో 49.2 శాతం మాదిగ, 41.6 శాతం మాలలుఉన్నారు.2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 1,38,78,078 మంది. వీరిలో మాదిగలు 67,02,609 కాగా, మాలలు 55,70,244. మాదిగల జనాభా మాలలకంటే 11,32,365 మంది ఎక్కువ.1997 జూన్ 6న ప్రభుత్వం జీవో ద్వారా షెడ్యూల్డ్ కులాల కోటాను వర్గీకరించింది. ఈ జీవో ప్రకారం ఎస్సీలను
ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా వర్గీకరించారు.
రోస్టర్ పాయింట్ల ప్రకారం ఉద్యోగాలలో కూడా సామన్యాయం జరుగుతుందని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.
