

కడప జిల్లా: గోపవరం: ఏప్రిల్ 15: మన న్యూస్: గోపవరం మండలంలోని శ్రీనివాసపురం గ్రామము నందు మంగళవారం బద్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ M. నాగభూషణం, మరియు బద్వేల్ రూరల్ ఎస్సై SI శ్రీకాంత్ లు గ్రామస్తుల తో సమావేశం ఏర్పాటు చేసి వేసవి కాలములో ముఖ్యంగా హైవే రోడ్ పక్కనే ఉండే ఇండ్లలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున,వాటిని నివారించుకోవడానికి గ్రామస్తులకు సీఐ తగు సూచనలు ఇవ్వడమైనని. సీసీ కెమెరాలు ఇంటి బయట గేట్ దగ్గర, ఇంటి ముఖద్వారం, బ్యాక్‌డోర్ లాంటి కీలక ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.ఇంటికి సాధారణ తాళాలకు బదులు హై క్వాలిటీ స్మార్ట్ తాళాలు లేదా మెయిన్ డోర్ కు సాధారణ గడియ,తాళం కాకుండా డోర్ కు సెంటర్ లాక్ పెట్టించుకోవాలి .ఇంటి చుట్టూ రాత్రి వేల తగిన వెలుగు ఉండేలా చూసుకోండి. గేట్ దగ్గర లైట్స్ పెట్టండి. ఎక్కడికైనా ప్రయాణాలు చేయవవలసి వస్తే ఇంటిలో బంగారు ఆభరణాలు మరియు ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంచరాదు. విలువైన వస్తువులను ఇంట్లో ఎక్కువ కాలం ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచడం ఉత్తమం. ఎండాకాలం ఆరుబయట పండుకునప్పుడు ఇంటిలోని బంగారు ఆభరణాలు జాగ్రతగా భద్రపరచుకోవలెను. మహిళలు బంగారు ఆభరణాలు ధరించి ఆరుబయట నిద్రించరాదు.
అనుమానాస్పద వ్యక్తులు గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ముఖ్యంగా మీరు ఎక్కువ రోజులు ఇంట్లో లేనప్పుడు,స్థానిక పోలీస్ స్టేషన్లో మీ ఇంటి సమాచారం ఇచ్చిన యెడల పొలిసు వారు తగు నిఘా ఏర్పాటు చేస్తామని వారు చెప్పడం జరిగింది.
