వేసవి అపరాల సాగుతో పంట మార్పిడి,వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మొక్కజొన్న తర్వాత మరల మొక్కజొన్న సాగు చేసే అలవాటు ఎక్కువగా ఉందని రబి సీజన్లో మొక్కజొన్న వేసిన తర్వాత మరల ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న వెయ్యటానికి 70 నుండి 80 రోజుల వ్యవధి ఉంటుందని ఈ సమయంలో పెసర లేదా మినుము వేసుకుంటే పంట మార్పిడి ప్రయోజనాలను కొంతవరకు సాధించవచ్చునని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు పాంచాలి గ్రామంలో రైతులు పాంచాలి ఈశ్వరరావు కలువలపల్లి సోంబాబు క్షేత్రాలలో వేసవి పెసర మరియు మినుము విత్తనాలను చెల్లించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి అపరాల సాగుతో అదనపు ఆదాయం వస్తుందని ఈ ఆదాయంతో వచ్చే ఖరీఫ్ సీజన్ కు పెట్టుబడి కలిసి వస్తుందని వేసవి అపరాలు సాగు ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.
నేలను వేసవిలో అధిక వేడి నుండి కాపాడుతుంది
అపరాల వేర్ల గుడిపల్లి మీద ఉండే రైజోబియం బ్యాక్టీరియా గాలిలో ఉండే నత్రజని భూమిలో స్థిరీకరించి ఖరీఫ్ పంటకు అందిస్తుంది
ఖరీఫ్ పంటలో కలుపు ఉధృతి తగ్గుతుంది.
సారవంతమైన మృత్తిక గాలికి ఎండకు వానకు కొట్టుకొని పోకుండా కాపాడుతుంది,
భూమిలో జీవ వైవిధ్యాన్ని పెంచుతుంది,
నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది,
పైరు వ్యర్ధాలను కలియ దున్నటం వలన నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది,
ప్రస్తుతం 50 శాతం రాయితీపై విత్తనాలు అందజేయబడుతున్నాయని కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాలను సంప్రదించి వేసవి అపరాలు సాగు ద్వారా భూమిని కాపాడుకుంటూ అధిక దిగుబడులు పొందవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా ప్రకృతి సేద్య యల్ వన్ తిరుపతి నాయుడు పెసర మరియు మినుము పంటలకు విత్తన గుళికలు తయారు చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీను, దినేష్,బాలకృష్ణ,గణేష్, అనిల్ కుమార్,మరియు రైతులు పాల్గొన్నారు.

  • Related Posts

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి