

మనన్యూస్,తిరుపతి:ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టపాలు చేసేందుకు మాజీ టీటీడీ చైర్మన్, భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తూ వ్యవహరిస్తున్నారని ఇకనైనా నీ వ్యవహార శైలి మానుకోవాలని లేని పక్షంలో భగవంతుడు తన నిఘానేత్రంతో తగిన గుణపాఠం నేర్పుతారని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందువులు పూజించే పవిత్రమైన గోమాతపై అసత్యపు ప్రచారాలు చేయడం తగదన్నారు. గత ఐదేళ్లలో సుబ్బారెడ్డి ధర్మారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు హరినాద్ రెడ్డిని పరిరక్షణ అధికారిగా నియమించుకొని కోట్లాది రూపాయలు కుంభకోణం చేశారని ఆరోపించారు. పలమనేరు లోను తిరుపతి టీటీడీ ఎస్వీ గోశాలలను అనేక కుంభకోణాలు జరిగాయన్నారు. మూగజీవాలు తినే ఆహారంలో కూడా కమిషన్లు తీసుకున్న ఘనత మీదేనన్నారు. ఎన్డీఏ కూటమి అధికారుల్లోకి వచ్చి ఆరు నెలలు కాలంలోనే టీటీడీ కూటమి పైన లేనిపోని విమర్శలు చేయడం తగదన్నారు. మీ హయంలో ఎస్వీ గోశాలలో దానా కుంభకోణం నాణ్యతలేని మందులు సరఫరా చేసి గోవుల మరణాలకు కారణమయ్యారని తెలిపారు. ప్రతి విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం తగదన్నారు. ప్రస్తుత టిడిపి పాలన, కూటమి ప్రభుత్వ పాలన రాజ్యాంగబద్ధంగా లేదని రెడ్ బుక్ ప్రకారం జరుగుతుందని విమర్శించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మీ హయాంలో కేవలం ముఖ్యమంత్రి టిటిడి అధికారులు అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని ఎనిమిచ్చుకున్నారని అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి అన్ని కులాలకు చెందిన వారిని అందరికీ అవకాశం ఇస్తున్నారని తెలిపారు పరిశుద్ధ చైర్మన్ బిఆర్ నాయుడు భక్తులకు పారదర్శకంగా పాలన అందిస్తున్నారని దర్శనాల విషయంలోనూ లడ్డూల విషయంలోనూ ప్రతిదీ భక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన్ని కూడా విమర్శించడం తగదన్నారు. కరుణాకర్ రెడ్డి గారు టిటిడిలో జరుగుతున్న విషయాలపై పదేపదే అసత్యపు ఆరోపణలు చేస్తూ కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు మీరు చేసిన అక్రమాలపై విచారం చేపట్టి దోషలను కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు. యాదవులకు గోవు ప్రధానమైన జంతువు అని అలాంటి గోమాతపై అసత్యపు ప్రచారాలు చేయడం దేశవ్యాప్తంగా యాదవుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు అని దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు. కరుణాకర్ రెడ్డి ఇకనైనా అసత్యాలు మానుకొని అభివృద్ధికి సలహాలు ఇచ్చి టీటీడీ ప్రతిష్టను కాపాడమని ఆయన హితవు పలికారుఅనంతరం నగరపాలక డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ మాట్లాడుతూ
కరుణాకర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన నిలదీశారు. మీడియా సమావేశంలో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ తనకు టిటిడిలో రెండువేల మంది శ్రేయోభిలాషులు నిఘా నేత్రాలు ఉన్నాయని చెప్పడం పై టిటిడి ఉద్యోగులలో ఏ ఒక్కరు స్పందించకపోవడం విస్మయం కలిగిస్తుంది అన్నారు. టీటీడీ లో పనిచేస్తున్న పదివేల మంది ఉద్యోగులు ఏ ఉద్యోగి కరుణాకర్ రెడ్డి మాటలపై స్పందించకపోవడం ఏమిటి అని ఆయన ఉద్యోగస్తులను ప్రశ్నించారు. టీటీడీలోని పనిచేస్తున్న ఏ కొద్దిమంది ఉద్యోగులు చేస్తున్న పనుల వల్ల మిగిలిన ఉద్యోగులు కూడా ఇబ్బందికి గురి కావలసి వస్తుందన్నారు. కొండపైన చైర్మన్ ఈవో, అడిషనల్ ఈవో మిగిలిన విషయాలనీ ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందిస్తూ ఉన్నారని కరుణాకర్ రెడ్డి చెప్పడం విష్మయం కలిగిస్తుంది అన్నారు. టిటిడి ఉద్యోగస్తులు కరుణాకర్ రెడ్డి మాటలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ బాబుల దృష్టికి తీసుకువెళ్లనట్టు ఆయన పేర్కొన్నారు. తిరుమలలో పాలన చక్కగా కొనసాగుతోందని, బి ఆర్ నాయుడు భక్తితో భక్తులకు బాధ్యతతో సేవలు అందిస్తున్నారు అని నరసింహ యాదవ్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర,సుబ్బు యాదవ్, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
