

సింగరాయకొండ మన న్యూస్:-
: సాంత్వనాసేవా సమితి డైరెక్టర్ రావినూతల జయ కుమార్ చేసిన సేవా కార్యక్రమాలు కాను. ముఖ్యంగా బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాలల వెట్టి చాకిరి నిర్మూలన, బాల కార్మికుల వ్యవస్థ ను బంగారు బాల్యం కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించినందుకు గాను ఈ అవార్డును రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో శ్రీమతి మంజుల హైకోర్టు న్యాయవాది మరియు తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది శ్రీమతి ఆదిలక్ష్మి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జీవోస్ అధ్యక్షురాలు డా. లక్ష్మీ చేతుల మీదగా ప్రధానం చేశారు.
చాలా ఆనందంగా ఉంది…సాంత్వనా డైరెక్టర్ జయకుమార్…
ప్రకాశం జిల్లాలో గౌరవ కలెక్టర్ శ్రీమతి ఏ. తమిమ్ అన్సారీయ ఐఏఎస్ గారు ప్రారంభించిన ” బంగారు బాల్యం” అనే ఈ కార్యక్రమం ద్వారా వీటిని అరికట్టడం జరిగింది. అందుకు కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం వల్లే ఈ అవార్డు వచ్చింది అని ఆయన తెలిపారు.