

అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన టిడిపి నాయకుడు శ్రీధర్ యాదవ్
మన న్యూస్, ఎస్ఆర్ పురం:-అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని టిడిపి జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ పిలుపునిచ్చారు సోమవారం భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని గంగాధర్ నెల్లూరు మండలం నెల్లెపల్లి పంచాయతీలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశయలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడు అవుతాడు ఆ మహనీయుడే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ప్రపంచ దేశాలను అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేసి ఆయన ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగయ్య , ఎక్స్ ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం,TNTUC దేవరాజు నాయుడు, పంచాయతి సెక్రటరీ నాగేంద్ర నాయక్, సచివాలయం స్టాప్ చంద్రబాబు రెడ్డి ,డిజిటల్ అసిస్టెంట్ సునీల్ కుమార్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ తులసి రామ్, వెల్ఫేర్ అసిస్టెంట్ కవిత, హార్టికల్చర్ అసిస్టెంట్ అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు,
