డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు (AISA)

మన న్యూస్, తిరుపతి : ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఐఎస్ఎ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షులు రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు, హక్కులు ఏమి ఉన్నాయని తెలిపిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలిపారు. భారతదేశంలో అణగారిన కులాల సమానత్వం, సామాజిక న్యాయం కోసం తన జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారిని పేర్కొన్నారు. అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం, దురహంకారం పై గొంతిత్తిన స్వరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వర్ణించారు. న్యాయశాఖ మంత్రిగా సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలను రూపొందించడంలో అంబేద్కర్ గారి పాత్ర మరువలేనిది అన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వసమానత్వానికి కృషిచేసిన కారణజన్ముడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు చేసిన పోరాటాలు అనన్య సామాన్యమని తెలిపారు.భారతదేశ సమాజానికి అంబేద్కర్ చేసిన సేవలను గౌరవించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం అని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశీ, కృష్ణ వంశీ, వేణు,సషయ్యద్ బాషా, నవీన్, సునీల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

వైసీపీ నేత ఎమ్మిలి వీరబాబు ను పరామర్శించిన ముద్రగడ గిరిబాబు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం మెరక చామవరం గ్రామంలో వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పర్యటించి వైసిపి కార్యకర్తలను నాయకులను అభిమానులను కలిశారు. మెరక చామవరం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు ఎమ్మిలి వీరబాబు ఇటీవల కాలంలో అనారోగ్యంతో…

జగన్ పై అభిమానం ప్రజల్లో చెరగని ముద్ర…

శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పర్యటించి వైసిపి కార్యకర్తలు నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహితులు పెండ్యాల రాము, సుబ్రహ్మణ్యం (తండ్రి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

వైసీపీ నేత ఎమ్మిలి వీరబాబు ను పరామర్శించిన ముద్రగడ గిరిబాబు

  • By APUROOP
  • April 25, 2025
  • 5 views
వైసీపీ నేత ఎమ్మిలి వీరబాబు ను పరామర్శించిన  ముద్రగడ గిరిబాబు

జగన్ పై అభిమానం ప్రజల్లో చెరగని ముద్ర…

  • By APUROOP
  • April 25, 2025
  • 3 views
జగన్ పై అభిమానం ప్రజల్లో చెరగని ముద్ర…

కత్తిపూడి లో ఉగ్రదాడి మృతులకు జనసేన కన్నీటి సంతాపం..

  • By APUROOP
  • April 25, 2025
  • 2 views
కత్తిపూడి లో ఉగ్రదాడి మృతులకు జనసేన కన్నీటి సంతాపం..

అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

  • By APUROOP
  • April 24, 2025
  • 4 views
అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు