

మనన్యూస్,తిరుపతి:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భావితరాలకు దిక్సూచి లాంటి వారని, ఆయన జీవితం ఆదర్శనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి యాదవ్ తెలిపారు. సోమవారం బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జయంతిని పురస్కరించుకొని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని , భారత రాజ్యాంగ నిర్మాత అని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ఉందని పుష్పావతి యాదవ్ తెలిపారు. ఆమెతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
