
మన న్యూస్, సర్వేపల్లి,ఏప్రిల్ 12:తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాల్లోకి లాగడం వైసీపీకి అలవాటుగా మారింది అనే సర్వేపల్లి ఎమ్మెల్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.గతంలో చంద్రబాబు నాయుడి ఇంట్లో పింక్ డైమండ్ ఉందని నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు.తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి పింక్ డైమండే లేదని తర్వాత విచారణలో తేలింది అని అన్నారు.ఇప్పుడేమో టీటీడీ గోశాలలో గోవులు చనిపోయాయని దుష్ర్పచారానికి తెరలేపారు అన్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తోంది అని అన్నారు.టీటీడీకి మంచి పేరు రావడాన్ని వైసీపీ నేతలు సహించలేకపోతున్నారు.వైసీపీ పాలనలో టీటీడీని భ్రష్టుపట్టించిన భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు గోమాతల పేరుతో రాజకీయాలు చేయడం దుర్మార్గం అన్నారు.గోవిందుడు, గోమాతతో ఆటలాడొద్దని వైసీపీ నేతలకు హితవు పలుకుతున్నాం అని అన్నారు. గోశాలలో గోవుల సంరక్షణపై టీటీడీ అత్యంత శ్రద్ధ చూపుతోంది.తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రదిష్టపాల్జేసేందుకు ఎవరు ప్రయత్నం చేసినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు.
