

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కటారి కోట గ్రామ పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని చిన్నపాటి వర్షం పడిన కొండనుంచి వచ్చిన గెడ్డ వాగు నీరు వరద వలన పాఠశాలకు వెళ్లకుండా పిల్లలకు ఉపాధ్యాయులకు ఆటంకంగా ఉందని వెంటనే ప్రహరీ గోడ నిర్మాణం పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి స్కూల్ అభివృద్ధికి కృషి చేయాలని.కటారి కోట ఎంపీపీ స్కూలు విద్యా కమిటీ చైర్మన్ ఎర్ర సంతోష్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ వలసి లక్ష్మణరావు ఆదివాసి గిరిజన సంఘం నాయకులు గిన్నిపల్లి రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాచిపెంట మండలం గుమ్మడిగూడ పంచాయతీలో కటారి కోట గ్రామములో 34 మంది పిల్లలు చదువుకుంటున్నారని చిన్నపాటి వర్షం వస్తే కొండ వాగు వరద వలన బడికి వెళ్లడం ఇబ్బందిగా ఉందని ఇటువంటి పరిస్థితుల్లో కూడా రక్షణ గోడ నిర్మాణం పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టి ఇబ్బందుల నుండి తొలగించాలని అన్నా. అలాగే ప్రస్తుతం పాఠశాల బిల్డింగ్ లేకపోవడం వల్ల రేకుల షెడ్ లో బడి నడుస్తుందని అన్నారు. గతంలో నిర్మించిన బిల్డింగు ప్రారంభం కాకుండానే పాడు అయిపోయింది అని అన్నారు. మరలా కొత్త బిల్డింగు ప్రారంభిం చాలని అన్నారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ జిల్లా విద్యాధికారులు ఎంఈఓ పర్యవేక్షణలో నిర్మాణం కాకుండా పాడైపోయిన బిల్డింగ్ ని తొలగించి దాని స్థానంలో కొత్త స్కూలుబిల్డింగ్ నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రహరీ గోడ నిర్మాణం వేగవంతం చేయకపోతే వరద నీటికి పిల్లలు కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది అని దీనిపైన యుద్ధ ప్రాతిపదికగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని వెంటనే ప్రహరీ గోడ నిర్మించి స్కూల్ పిల్లలకు రక్షణ కల్పించాలని ఉపాధ్యాయులకు కూడా ఇబ్బందులు లేకుండా వెంటనే ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని అన్నారు. ప్రస్తుతం రేకుల షెడ్ లో బడి నడుస్తున్న సందర్భంగా బిల్డింగు కూడా పూర్తిగా నిర్మించి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజనులు,ఎర కన్నదొర జాడు కొండయ్య పెదకాపు రాము ఎర్రజన్ని తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు గిన్నిపల్లి రాజు విద్యా కమిటీ చైర్మన్ ఎర్రజన్ని సంతోష్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
