

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 10 :ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ ( APEJU ) రాష్ట్ర కో – కన్వీనర్ ఉడత రామకృష్ణ అదేశాలు మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూనియన్ ఫౌండర్ , రాష్ట్ర నాయకులు , స్ప్రెడ్ న్యూస్ ఎడిటర్ రమేష్ రెడ్డి , యూనియన్ వైస్ ప్రెసిడెంట్ , సదా మీకోసం దిన పత్రిక కావలి రిపోర్టర్ ఆవుల వెంకటేశ్వర్ల కు గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదురుగా ఉన్న నెల్లూరు ప్రెస్ క్లబ్ లో సంతాప సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సమాచార, పౌర సంబంధాల శాఖ నెల్లూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ సదారావు పాల్గొని మాట్లాడుతూ రమేష్ రెడ్డి చాలా మంచి వ్యక్తి అని, మా కార్యాలయానికి ఎప్పుడూ వచ్చిన అందరితో కలసిమెలసి సంతోషంగా ఉండేవారని తెలిపారు. స్థానిక పత్రికలవారికి అన్ని విధాలా సహాయ సహకారాన్ని అందించేవారని కొనియాడారు. ఆవుల వెంకటేశ్వర్లు చాలా సీనియర్ రిపోర్టర్ అని తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం తరపున వారికి వచ్చే అన్ని సంక్షేమాలను అందించే వరకు సహకారాన్ని అందించనున్నట్లు చెప్పారు. మరొక అతిధి ఏపియూడబ్ల్యూజే జిల్లా ఎలక్ట్రానిక్ మిడియా జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి రమేష్ బాబు మాట్లాడుతూ యూనియన్ తరుపున వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సంతాప సభ కార్యక్రమానికి ఆర్ పి ఐ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు షైక్ మాబు , వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు , ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్, కృష్ణపట్నం పోర్టు మీడియా మేనేజర్ బొనిగి శీనయ్య, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ గౌరవ సలహాదారులు జి.ప్రతాప్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గట్టుపల్లి శివకుమార్ , కోశాధికారి మాటేటి రత్నప్రసాద్ , ఏ పి ఈ ఆర్ యూ జిల్లా అధ్యక్షులు శ్రీహరి , ప్రధాన కార్యదర్శి రావూరి రమేష్ , ఏపియూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి గడ్డం హనోక్ , ఏపీఈజేయు నాయకులు పిగిలం నాగేంద్ర , వరప్రసాద్, ఉదయ్ కుమార్ రెడ్డి ,ఉదయ్ కుమార్ ,పిగిలం చక్రధర్ , సింహపురిటుడే సంపాదకులు గౌస్ బాషా బహుజన భేరి సంపాదకులు ప్రతాప్ , సింహపురి వాయిస్ సంపాదకులు హుమయున్ , ,నమేస్తే నెల్లూరు ఎడిటర్ జడ్డయ్య , ఆవుల వెంకటేశ్వర్లు కుమారులు నితీష్ , ప్రెస్ క్లబ్ ఇంచార్జ్ ఆరవ సుధాకర్ ,జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
