మహిళలకు ఆరాధ్యదైవం మహాత్మా జ్యోతిబాపూలే…

  • *ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు…*

మన న్యూస్ నంద్యాల (అపురూప్): మహిళలకు ఆదర్శనీయులు జ్యోతిబా పూలే అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణం నందలి మహాత్మ జ్యోతిరావుపూలే ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల (బాలికల) నందు యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి ,డోన్ మండల కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిరావుపూలే గారి198 వ జయంతి సందర్భంగా పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మరియు విగ్రహాల దాత, బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కల మిట్ట శ్రీనివాసులు, కళాశాల ప్రిన్సిపల్ వసుంధర దేవి యస్సీ యస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్మిడి లక్ష్మణ్ సాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ మహిళల విద్య కొరకు పాటుపడిన మహోన్నతమైన మహనీయులు జ్యోతిబా పూలే అని ఆమె అన్నారు. తన భార్య అయిన సావిత్రిబాయిపూలే కు చదువు నేర్పించి ఆమెను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది ఆమె ద్వారా మహిళలకు విద్యనందించి మహిళలను గౌరవించిన జ్యోతిరావుపూలే మహిళలకు ఆరాధ్యదైవం అని ఆమె తెలిపారు. మహిళలు, క్రింది కులాల వారు చదువుకుని విజ్ఞానవంతులు అయితేనే సామాజిక చైతన్యం కలుగుతుందని, సామాజిక చైతన్యం వచ్చినపుడే బహుజనులు అభివృద్ధి వైపు అడుగులు వేయగలరని పూలే ఆశించారని ఆమె అన్నారు. బహుజన కులాల అభివృద్ధి కోసం జీవితాన్ని అర్పించిన మహాత్మా జ్యోతిరావు పూలే 1890 నవంబర్ 28 వ తేదీన కన్నుమూశారు. ఆ మహనీయుల ఆలోచనలతో, వారి ఆశయాల కోసం బహుజనులు అందరూ ఏకమై కృషి చేయాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ అధ్యక్షురాలు భారతమ్మ, కర్నూలు జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధ,నంద్యాల జిల్లా ఉపాధ్యక్షురాలు ఆకుతోట పద్మావతి, గుత్తి మండల అధ్యక్షురాలు సుంకమ్మ, షేకున్ బి, లక్మేశ్వరి, ఖాసీంబీ దస్తగిరమ్మ, మారెమ్మ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///