

మన న్యూస్,తిరుపతి : టీటీడీ గోశాలలోని మూగజీవాలను కూడా వైసిపి నాయకులు రాజకీయం చేయడం తగదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం చెప్పారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఎస్ వి గోసంరక్షణ శాలలో గత మూడు నెలలుగా 100 ఆవులు చనిపోయాయి అని భూముల కరుణాకర్ రెడ్డి చెప్పడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కరుణాకర్ రెడ్డి కి నైతిక విలువలు ఏమాత్రం లేవని, ప్రజలు మీ కుటుంబాన్ని తిరస్కరించిన మళ్లీ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రిలయన్స్ సంస్థ కోటి 35 లక్షల రూపాయలు నిధులను ఇచ్చారని ఆ డబ్బులతో 30 నుంచి 40 ఆవులు కొనుగోలు చేశారన్నారు. వాటిని తీసుకువచ్చే క్రమంలో కొన్ని అనారోగ్యానికి గురై చనిపోతే మరికొన్ని వయసు పైబడినవి చనిపోతూ ఉంటాయని చెప్పారు. గత నెల 28వ తేదీన ఓ రైలు బండిని ఒక ఆవు ఢీకొని చనిపోయిందని పేర్కొన్నారు. భువన కరుణాకర్ రెడ్డి చెప్పినట్లు వందల ఆవులు చనిపోలేదని ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. 2022 -23 సంవత్సరాలలో 90 గూగుల్ చనిపోయాయి అని, అప్పుడు ఎందుకు కరుణాకర్ రెడ్డి మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎస్ వి గోశాలలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్ వి గోసంరక్షణ అధికారి హరినాథ్ రెడ్డి సస్పెన్షన్కు గురైన టీటీడీకి చెందిన మొబైల్ ఫోను వినియోగిస్తూన్నారని వెంటనే ఆయన టీటీడీకి సెల్ ఫోన్ ను సిమ్ ను అప్పగించాలని కోరారు. వైసిపి ప్రభుత్వ హయాంలో 1500 గోవులు మాత్రమే గోశాలలో ఉండేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక 200700 పైగా గోవులు సంరక్షణలో ఉన్నాయన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కరుణాకర్ రెడ్డి నిరూపించలేక పోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని, వెంటనే రాజకీయ సన్యాసం ప్రకటించాలని డిమాండ్ డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎం ఆర్ పల్లి రామచంద్రారెడ్డి, మధుబాబు, నందకుమార్, ఉమాపతి, ఖాజా పాల్గొన్నారు.
