

మన న్యూస్,నెల్లూరు, ఏప్రిల్ 11:నెల్లూరులో జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా మిని బైపాస్ నందు వారి విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన బీసీ కులగణన మేమెంతో మాకంత మా వాటా మాకు ముద్దు అంటూ ఏ పీ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేదిక లో గునుకుల కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ…….సామాజిక న్యాయం కోసం మొదటిగా పోరాడింది ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు చిరంజీవి,ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీగా ఈరోజున రూపాంతరం చెందింది అని అన్నారు.వెనుకబడిన తరగతుల వారికి ఎక్కువ రాజకీయ అవకాశాలు ఇచ్చిన దేశంలోని మొట్టమొదటి పార్టీ ప్రజారాజ్యం పార్టీ.ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అన్ని కులాలను కలుపుకుంటూ వారి హక్కులను సాధించుకుంటూ ఆరోజున మహాత్ముల ఆశయం అన్ని వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నారు అని అన్నారు.ఎవరికీ పలానా కులంలో పుట్టాలని కోరుకునే ఛాయిస్ లేదు కాబట్టి ఎవరి కులాల సంఖ్యను బట్టి వారు హక్కుల కోసం ప్రభుత్వం నిర్మించిన కోరవచ్చు అని తెలియజేశారు.ఎవరి హక్కులు కోసం వారు పోరాటం సమంజసమే మీ ఆలోచనలను పెద్దలకు తెలియపరుస్తారని మాటిచ్చారు అని అన్నారు.
