

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 11: బద్వేల్ మండలం తొటిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రము నందు ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభయాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమంలో సంజీవిని హాస్పిటల్ బద్వేల్ డాక్టర్ శివ లలిత స్త్రీ వ్యాధి నిపుణులు గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు అందించడమైనది.ఈ కార్యక్రమంలో డాక్టర్ శివ లలిత మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పోషకాహార లోపం రక్తహీనత లేకుండా గర్భిణీ సమయంలో తీసుకొనవలసిన జాగ్రత్తలు సురక్షిత కాన్పులను గురించి గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించడమైనది.కష్టతరమైన వారిని గుర్తించి ప్రత్యేక స్కానింగ్ కొరకు పై ఆసుపత్రులకు వైద్య పరీక్షల కొరకు రఫర్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో డాక్టర్ జె.వినయ్ కుమార్, బి.వెంగయ్య హెల్త్ ఎడ్యుకేటర్ కె. చంద్రావతి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె. వెంకటమ్మ ,హెల్త్ సూపర్వైజర్ పాల్గొని గర్భిణీ స్త్రీలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య పరీక్షలు అంగన్వాడి కేంద్రాల్లో అందించే పోషక పదార్థాలు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు గవర్నమెంట్ హాస్పిటల్ నందు కాన్పులు జరుగుతే జననీ సురక్ష యోజన, శిశు జనని సురక్ష పథకాల 108, 102 వాహనం ద్వారా అందజేయు సేవలను గురించి వివరించడమైనది. ఈ కార్యక్రమానంతరము గర్భిణీ స్త్రీలందరికి వీరపల్ల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ఏ. ఎన్. యం,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఆశా కార్యకర్తలు కలిసి అల్పాహారము ఏర్పాటు చేసి, కడప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి మల్లేష్ ద్వారా అందించడమైనది ఈ కార్యక్రమము ప్రతినెల 9,10 వ తారీఖున జరుగుతుందని ప్రతి గర్భిణీ స్త్రీలు, కష్టతరమైన గర్భిణీ స్త్రీలను గుర్తించి సరైన సమయంలో సరైన వైద్యము పరీక్షలు చేయించి 102,108 సేవలు ఉపయోగించుకోవలసినదిగా పేర్కొనడమైనది. అదేవిధంగా పూర్వస్థ పిండ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరము కావున బాలికలను రక్షిద్దాం బాలికలను చదివిద్దాం అనే కార్యక్రమమును ప్రజల్లోకి తీసుకొని పోయి బాలికల యొక్క నిష్పత్తి పెంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని బి వెంగయ్య హెల్త్ ఎడ్యుక్టర్ పేర్కొనడమైనది. ఈ కార్యక్రమంలో డాక్టర్ జై వినయ్ కుమార్ మెడికల్ ఆఫీసర్ మరియు బి వెంగయ్య హెల్త్ ఎడ్యుకేటర్, జై చంద్రావతి కమిటీ హెల్త్ ఆఫీసర్, హెల్త్ సూపర్వైజర్ వెంకటమ్మ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు పాల్గొనడం అయినది.